
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మొట్ట మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. చైనా మొబైల్ తయారీ దిగ్గజం రియల్‌మి తాజాగా భారత్‌లో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరించింది. రియల్‌మి ఎక్స్50 ప్రొ 5జీ పేరిట ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టారు. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ ఇస్తున్న వాటిలో రియల్మీ ఒకటి. ఇక ప్రస్తుతం ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశ పెట్టడంతో రియల్మీ క్రేజ్ మరింత పెరిగింది. ఇండియాలో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేకుండా ఈ ఫోన్లోనే 5జీ నెట్వర్క్ వాడుకోవచ్చు. అయితే ఇండియాలో 5జీ నెట్వర్క్ ఎప్పట్లోగా అందుబాటులోకి వస్తుందన్న స్పష్టత లేదు.
ఇక ఈ ఫోన్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 37,999 నుంచి ప్రారంభమవుతుంది. మెమరీ స్టోరేజీ సామర్థ్యాన్ని బట్టి మూడు వేరియంట్లో లభ్యం. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ విషయానికి వస్తే... 90 Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ అమొలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 12జీబీ వరకు ర్యామ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటిని విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. 4జీ, 5జీ టెక్నాలజీపై పనిచేసేలా డ్యుయల్ సిమ్ ఫీచర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. అలాగే స్పెసిఫికేషన్స్ చూస్తే 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సాంసంగ్ సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉండటం విశేషం.
రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్+64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా+8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ అండ్ మైక్రో లెన్స్+బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ ఉన్నాయి. మరియు రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 4200 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జ్ టెక్నాలజీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ రస్ట్ రెడ్, మాస్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. మరియు రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.37,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.39,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ+256జీబీ ధర రూ.44,999.