
ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి ఆలోచనా విధానం మారు తోంది. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లను బాగానే ఉపయోగిస్తున్నారు. కొత్త కొత్త ఫీచర్లతో టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఫోన్ స్లో అయ్యే సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఎంత మంచి బ్రాండ్ అయినా ఈ సమస్య అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. వేలు ఖర్చు చేసి కొన్న ఫోన్ సంవత్సరం కూడా వేగంగా పనిచేయకపోతే ఎలా ఉంటుంది. కొన్ని సార్లు హ్యాంగ్ అవుతుంది. మళ్ళీ ఫోన్ రీస్టార్ట్ చేస్తేనే పని చేస్తుంది. ఇది అందరూ ఎదుర్కొనే సమస్యనే.
కానీ, దానికి కారణాలు తెలుసుకుని ఇంకెప్పుడూ అలా కాకుండా చూసుకునే బాధ్యత మనదే. అయితే ఫోన్‌లలో మనం అనేకమైన యాప్స్‌ను ఇన్స్‌స్టాల్ చేయడం వల్ల డివైస్ స్టోరేజ్ స్పేస్ పై ఒత్తిడి తేవటమే కాకుండా ఫోన్ పనితీరుతో పాటు బ్యాటరీ లైఫ్ పై ప్రభావం చూపుతాయి. మీ స్మార్ట్‌ఫోన్ పనితీరుతో బ్యాటరీ లైఫ్‌ను ఇప్పటికిప్పుడు మెరుగుపరుచుకునేందుకు ఫోన్ నుంచి తొలగించాల్సిన ప్రధాన యాప్స్ ఎంటో చూడండి. వాతావరణ సమచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే క్రమంలో చాలా మంది యూజర్లు తమ ఫోన్‌లలో వెదర్ యాప్స్‌ను ఇన్స్‌స్టాల్ చేస్తుంటారు.
ఈ యాప్ తరచూ అప్‌డేట్ అవటానికి బోలెడంత బ్యాటరీ లైఫ్ అవసరమవుతుంది. మరియు ఫోన్‌ను స్లో అయ్యేలా కూడా చేస్తుంది.అలాగే ఫోన్‌లో ఇన్‌బుల్ట్‌గా వచ్చే డీఫాల్ట్ బ్రౌజర్‌కు ప్రత్యామ్నాయంగా అనేక బ్రౌజర్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. సో.. మీ ఫోన్‌లో డీఫాల్ట్‌గా వచ్చిన బ్రౌజర్‌ను డిసేబుల్ చేసి దాని స్థానంలో మీకు నచ్చిన బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో క్లీనింగ్ యాప్స్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకుంటున్నారు. కానీ, మీ ఫోన్‌లోని చెత్తను క్లీన్ చేసేందుకు క్లీనింగ్ యాప్సే అవసరం లేదు. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్‌లోని క్యాచీ డేటాను క్లియర్ చేస్తే సరిపోతుంది.