చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ వివో స్మార్ట్‌ఫోన్ల‌కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే.. వివో సరికొత్త ఫోన్ను మార్కెట్ లోకి తీసుకొచ్చి సంగ‌తి తెలిసిందే. ఎస్‌ సిరీస్‌లో భాగంగా మిడ్-బడ్జెట్ రేంజ్‌లో ఎస్ 1 ప్రో ఫోన్ను భారత దేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో రూ.20,990కు లాంచ్ చేశారు. అయితే ప్ర‌స్తుతం ఈ ఫోన్‌ ధర రూ.2,000 తగ్గింద‌ని కంపెనీ వెల్ల‌డించింది. అంతే ఇప్పుడు  వివో ఎస్1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.18,990 ధరకే కొనొచ్చు.

 

అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇకామర్స్ వెబ్‌సైట్స్‌తో పాటు వివో ఇండియా వెబ్‌సైట్‌లో కూడా ఈ తగ్గింపు ధర వర్తిస్తుంది. వివో ఎస్‌1 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో సూపర్ అమొలెడ్ డిస్‌‌ప్లే, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్ సీ పోర్ట్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు.

 

వివో ఎస్1 ప్రో.. 6.38 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ను అందించారు. అలాగే  వెనుకవైపు 48+8+2+2 మెగాపిక్సెల్ ఏఐ క్వాడ్ కెమెరా మ‌రియు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. దీంతోపాటు 8 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉంది. కాబ‌ట్టి.. లేట్ చేయ‌కుండా సేల్ మొద‌లుపెట్టంటి.

 


 

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: