ప్రముఖ టెలికాం సంస్థ జియో తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తమ యూజర్లకు ఎక్కువ డేటా అందించాలనే ఉద్దేశంతో జియో డేటా వోచర్లపై డబుల్ డేటాను యూజర్లకు ఫ్రీగా అందిస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రకటించాయి. యూజర్లు తక్కువ డేటాతో ఇబ్బందులు పడే అవకాశం ఉందని భావించి జియో ఈ నిర్ణయం తీసుకుంది. 
 
యూజర్లు ఆన్ లైన్ లో, ఫోన్ కాల్స్ ద్వారా ఇతరులను కాంటాక్ట్ అవుతూ ఉండటంతో గతంతో పోలిస్తే కాల్స్, డేటా వినియోగం పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో యూజర్లకు ప్రయోజనం చేకూర్చాలని జియో ఈ నిర్ణయం తీసుకుంది. 11, 21, 51, 101 రూపాయల వోచర్లపై జియో డబుల్ డేటాను అందిస్తోంది. ఉదాహరణకు గతంలో 11 రూపాయల ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే 400 ఎంబీ డేటా వచ్చేది. ఇప్పుడు జియో యూజర్లకు 800 ఎంబీ డేటా లభిస్తోంది. 
 
ఈ ఆఫర్ యూజర్లను ఎన్నిరోజులు అందుబాటులో ఉంటుందనే వివరాలు తెలియాల్సి ఉంది. అదనపు వోచర్లపై బెనిఫిట్స్ అందించటం పట్ల జియో యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జియో కస్టమర్లకు డబుల్ డేటా ఆఫర్ ప్రకటించడంతో మిగతా టెలికాం సంస్థలు కూడా కస్టమర్లకు ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది. తక్కువ డేటాతో ఇబ్బంది పడేవారికి ఈ ఆఫర్ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: