ఐఫోన్ ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ ఐఫోన్ చాలా కాస్టలీ.. కానీ కొనడానికి వస్తారు.. మధ్యతరగతి వారికీ ఐతే ఐఫోన్ పిచ్చి ఎంత ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఐఫోన్.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంటే చాలు అంటారు ఐఫోన్ ప్రేమికులు. ఇంకా ఈ నేపథ్యంలోనే బడ్జెట్ ఐఫోన్ ఈ నెల 5వ తేదీన విడుదల కానుంది. 

 

బడ్జెట్ ఐఫోన్ కు సంబంధించిన మొబైల్ ప్రొటెక్టివ్ కేసులు షాపులకు చేరుకున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ? ఈ బడ్జెట్ ఐఫోన్ ను ఐఫోన్ 9 అనాలో, ఐఫోన్ ఎస్ఈ 2 అని పిలవాలో వినియోగదారులకు కూడా పూర్తి క్లారిటీగా తెలీడం లేదు. అయితే ఫోన్లు అన్ని కూడా ముందే వచ్చినప్పటికీ ఈ ఫోన్లను ఏప్రిల్ 5వ తేదీన లాంచ్ చెయ్యాలని నిర్ణయించారు. 

 

నిజానికి ఈ ఐఫోన్ 9 లేదా ఐఫోన్ ఎస్ఈ2.. 2016లో లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ తరహాలో బడ్జెట్ ఐఫోన్ అని సమాచారం. ఈ ఇమేజ్ ని మొదటి 9to5Mac షేర్ చేసింది. దీని మీద “New iphone 4.7'',2020.” అని రాసి ఉంది. దీంతో ఈ ఐఫోన్ 9 కి సంబంధించింది అని సమాచారం. 

 

ఈ బడ్జెట్ ఫోన్ ప్రత్యేకతలు, ధర.. 

 

4.7 అంగుళాల స్క్రీన్, 

 

టచ్ ఐడీ హోం బటన్,

 

యాపిల్ ఏ13 చిప్, 

 

3 జీబీ ర్యామ్,

 

ఫోన్ ధర.. రూ.30,000

 

మరింత సమాచారం తెలుసుకోండి: