టిక్‌టాక్.. నేటి తరానికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ అనాతి కాలంలోనే శర వేగంగా ప్రజాదకన పొందింది. సోషల్ మీడియా పరిధి రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపధ్యంలో టిక్‌టాక్ యూజర్ల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఇండియాలో టిక్‌టాక్ యూజర్ల సంఖ్య భారీగా పెరింగింది. టిక్‌టాక్ వల్ల ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తున్నారంటూ ప్రశంసలు కురుస్తున్నా.. మరోవైపు టిక్‌టాక్ వల్ల ఎందరో ఉద్యోగాలు ఊడగొట్టుకున్నారు.. మరెందరో ఆత్మహత్యలూ చేసుకున్నారు.
ఇవన్నీ ఓ ఎత్తయితే మరెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇన్ని జరుగుతున్నా టిక్ టాక్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. టిక్‌టాక్ వీడియోలలో ఉండే టిక్‌టాక్ యొక్క వాటర్‌మార్క్ కొన్నిసార్లు అధిక కోపాన్ని వచ్చేలా చేస్తుంది. ఎందుకంటే ఇది ఫ్రేమ్ యొక్క ముఖ్యమైన భాగాల మీద ఉండడం వల్ల చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. అయితే వాటర్‌మార్క్ లేకుండా టిక్‌టాక్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి. ఇందుకు ముందుగా.. మీ యొక్క ఫోన్ టిక్‌టాక్ ను ఓపెన్ చేసి మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న వీడియోను సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు మీ ఫోన్‌లో షేర్ బటన్‌ను క్లిక్ చేయండి. మరియు కాపీ లింక్‌ను ట్యాప్ చేయండి. ఇప్పుడు www.musicallydown.com ని ఓపెన్ చేసి అందులోని సెర్చ్ బాక్స్‌లో వీడియో లింక్‌ను పేస్ట్ చేయండి. ఇప్పుడు సెట్టింగ్‌లలో "వీడియోమార్క్ లేకుండా వీడియో" ఆప్షన్ ను ఎంచుకోండి. తరువాత డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లీక్ చేయండి. తదుపరి స్క్రీన్‌లో డౌన్‌లోడ్ mp4 ను ఎంచుకోండి. తర్వాత స్క్రీన్‌లో డౌన్‌లోడ్ వీడియోను ఎంచుకుంటే సరిపోతుంది. అలాగే వాటర్‌మార్క్ లేకుండా టిక్‌టాక్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి మీరు www.ttdownloader.com ను కూడా యూజ్ చేయవచ్చు. టిక్‌టాక్ వీడియో లింక్‌ను సెర్చ్ బాక్స్‌లో పేస్ట్ చేసి వీడియో గెట్ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.