
సోషల్ మీడియాలో నెటిజన్లు అందరిని ఒక ఊపు ఊపేస్తున్న యాప్ ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు టిక్ టాక్. మొన్నటివరకు వాట్సాప్ ఫేస్బుక్ లో కాలం గడిపిన నెటిజన్లందరు ఇప్పుడు ఎక్కువ సమయం టిక్ టాక్ లోనే గడుపుతారు. ఏకంగా మాయదారి పబ్జి గేమ్ ని సైతం మరిపించేలా ప్రస్తుతం టిక్ టాక్ ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు టిక్‌టాక్ చూస్తున్నారు చేస్తున్నారు . టిక్ టాక్ యాప్ సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచుతుండడంతో ఎంతో మంది దీనికి ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే ఆన్లైన్ దిగ్గజాలైన ఫేస్బుక్ వాట్సప్ లను సైతం దాటేసింది టిక్ టాక్ .
తాజాగా మరో ఘనత కూడా సాధించింది టిక్ టాక్. తాజాగా 200 కోట్ల డౌన్లోడ్ మార్కును దాటేసింది టిక్ టాక్. అయితే ఇంత తొందరగా 200 కోట్ల డౌన్లోడ్ మార్కును దాటడానికి కరోనా వైరస్ ఒక కారణం అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. దాదాపుగా అన్ని దేశాలలో లాక్ డౌన్ అమలమవుతుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉండి బోరు కొట్టిన ప్రజలందరూ సరికొత్త ఎంటర్టైన్మెంట్ కోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్న మొదటి ఎంటర్టైన్మెంట్ టిక్ టాక్ కాబట్టి ఎక్కువగా యూస్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. దీంతో ప్రస్తుతం టిక్ టాక్ ఎంతో లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ అనలిటిక్స్ ప్లాట్ ఫామ్ సెన్సార్ టవర్ వెల్లడించింది. కేవలం త్రైమాసికంలోనే ప్లే స్టోర్ గూగుల్ యాప్స్ లో కలిపి మొత్తం 31.5 కోట్ల సార్లు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న ట్లు తెలిసింది. చైనాలో ఉన్న థర్డ్ పార్టీ నుండి జరిగిన డౌన్లోడ్లు ఈ లెక్కలో ఇంకా రానేలేదు. టిక్ టాక్ డౌన్లోడ్స్ చైనా సహా ఇండియా అమెరికా లో ఎక్కువగా జరిగినట్లు వెల్లడించింది. ఇక డౌన్లోడ్ చేసుకున్న వాళ్లు ఎంత మంది నెటిజన్లు టిక్ టాక్ యూస్ ఉపయోగిస్తున్నారు యాక్టివ్‌గా ఉన్నారు అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది.