ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాల్లోనూ కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లో చైనాలోని వూహాన్ నగరంలో పుట్టుకొచ్చిన ఈ కరోనా మహమ్మారి.. ప్రస్తుతం దేశదేశాలు వ్యాప్తి చెందింది. ఇక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40 లక్షల చేరువలో ఉన్నాయి. అమెరికా, రష్యా, బ్రెజిల్ దేశాల్లో వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది.
శాస్త్రవేత్తలు ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు పలు దేశాల్లో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించారు. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఈ లాఖడౌన్ సమయంలో కొన్ని యాప్స్ మీ ఫోన్‌లో ఖచ్చితంగా ఉండాలంటున్నారు నిపుణులు. మరి అవేంటి..? వాటి ఉపయోగాలు ఏంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముందుగా..
IMumz: ప‌్రెగ్నెన్సీ స్త్రీలు లాక్‌డౌన్‌లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ యాప్ యూజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ స్త్రీల సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు 100 మందికి పైగా ఆరోగ్య నిపుణులు అందుబాటులో ఉంటారు. లాక్‌డౌన్ టైమ్‌లో గర్భిణీలు ఒత్తిడికి గురికాకుండా, సమయానికి డాక్టర్‌ను సంప్రదించేందుకు ఈ యాప్ సహాయపడుతుంది.
UMANG: కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ ఈ యాప్‌ను రూపొందించారు. భారత పౌరులకు ప్రభుత్వ సేవలన్నింటినీ ఆన్‌లైన్‌లో అందించే యాప్ ఇది. చాలావరకు ప్రభుత్వ సేవలు మీకు ఆన్‌లైన్‌లోనే లభిస్తాయి. కాబట్టి, లాక్‌డౌన్ టైమ్‌లో ఈ యాప్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది.
Arogaya Setu: ఈ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోవిడ్ 19 పేషెంట్లను ట్రాక్ చేసేందుకు, కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ఇది. ఇప్పటి వరకు 9 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్టు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు అందులో సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు కరోనా వైరస్ సోకే రిస్క్ ఎంతో తెలుస్తుంది. కరోనా వైరస్ సోకినవాళ్లు ఎవరైనా మీకు దగ్గర్లో ఉంటే అలర్ట్ చేస్తుంది. మరియు ఇందులో కరోనా అప్‌డేట్స్ కూడా తెలుసుకోవచ్చు.