గతంలో గూగుల్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గా పనిచేసిన పాట్రిక్ పిచెట్ ని తమ కంపెనీకి చైర్మన్ గా నియమిస్తున్నామని ట్విట్టర్ సంస్థ తెలిపింది. 2017 వ సంవత్సరం లో పాట్రిక్ పిచెట్ ట్విట్టర్ సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో జాయిన్ అయ్యాడు. ఇంతక ముందు అనగా 2008 నుంచి 2017 వరకు గూగుల్ సంస్థలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పని చేశాడు. 

'ట్విట్టర్ యొక్క నిర్వహణ బృందం, బోర్డు యొక్క బలం, పరిజ్ఞానం తో మా పాలన నిర్మాణాన్ని ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా రూపొందించడానికి ఇది సరైన సమయం అని మేము నమ్ముతున్నాము' అని పాట్రిక్ పిచెట్ మంగళవారం రోజు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఇసి) కు దాఖలు చేశారు.


ప్రస్తుతం ట్విట్టర్ బోర్డులో చైర్మన్ పదవిలో కొనసాగుతున్న ఒమిడ్ కోర్డెస్టాని స్థానాన్ని ఆక్రమించి పాట్రిక్ పిచెట్ బాధ్యతలు స్వీకరిస్తారు. 'ఒమిడ్ కోర్డెస్టాని ఎక్సిక్యూటివ్ మేనేజ్మెంట్ లో అత్యంత విలువైన సభ్యుడిగా తన బాధ్యతలను నిర్వర్తించారు. ట్విట్టర్ సంస్థ కి నాయకత్వం వహిస్తూ గత ఐదేళ్లుగా చాలా చక్కగా తన బాధ్యతను నిర్వర్తించారు. ఇప్పుడు మేము సరికొత్త పాలన ద్వారా మా నిబద్ధతను రుజువు చేసుకుంటాను. ముఖ్యమైన మార్పులు చేయడానికి మాకిచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుంటాము', అని కొత్త గా నియమింపబడిన పాట్రిక్ పిచెట్ చెప్పుకొచ్చారు. సంస్థ సెక్యూరిటీస్, ఎక్స్చేంజ్ కమిషన్స్ ప్రకారం బోర్డు లో ఉన్నా ఉద్యోగులు కానీ సభ్యులకు కంపెన్సషన్( నష్ట పరిహారం) లభిస్తుంది. దీని ప్రకారం ట్విట్టర్ సంస్థ బోర్డులోని సభ్యుడైన ఒమిడ్ కోర్డెస్టాని కి నష్టపరిహారం అందుతుంది. 


ఒమిడ్ కోర్డెస్టాని మాట్లాడుతూ... ట్విట్టర్ సంస్థలో ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి అని నేను గ్రహించాను. అలాగే ట్విట్టర్ నాయకత్వం స్థిరంగా ఉందని... ఆ నాయకత్వం దీర్ఘకాలికంగా సంస్థ అభివృద్ధికి పెరుగుదలకు కచ్చితంగా దోహదపడుతుందని... ఇప్పుడు తాను ప్రశాంతంగా తన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుండి తప్పుకోగలనని చెప్పాడు

మరింత సమాచారం తెలుసుకోండి: