ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫోన్ లు లాంచ్ చేసింది.. అలాంటి ఈ పోకో బ్రండ్ ఇప్పుడు మరో అద్భుతమైన ఫోన్ ని లాంచ్ చేసింది.. అదే పోకో ఎం2 ప్రో అనే కొత్త స్మార్ట్ ఫోన్ . ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ధర కూడా తక్కువే. మరి ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు... 

 

6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కవైపు అందించారు.

 

వెనకవైపు నాలుగు కెమెరాలు, ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ + 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు అందించారు. 

 

ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

 

బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ గా ఉంది. 

 

ఈ పోకో ఎం2 ప్రోలో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 

 

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా నిర్ణయించారు. 

 

6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. 

 

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గానూ నిర్ణయించారు. 

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ అవుట్ ఆఫ్ ద బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. 

 

ఇంకా ఈ ఫోన్ కు సంబంధించిన సేల్ ఫ్లిప్ కార్ట్ లో ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: