చైనా దేశపు రెగ్యులేటరీ వెబ్ సైట్ టెనాలో తాజాగా రెడ్ మీ కే30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కు సంబంధించి M2006J10C మోడల్ నెంబర్ తో ప్రత్యక్షం అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ వెబ్ సైట్ లో పొందుపరిచింది సంస్థ. ఇక ఈ ఫోన్ ఆగస్టు 14వ తేదీన మార్కెట్లోకి విడుదల కాబోతున్నట్లు అందులో తెలుస్తోంది. అయితే సమాచారం అందినంత మేరకు ఈ ఫోన్ కు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్ల వివరాలు మీ కోసం...



రెడ్ మీ కే 30 అల్ట్రా లో 6.67 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉండబోతుంది. ఈ ఫోన్ 6 జీబీ, 8 జీబీ, 12 జీబీ ర్యామ్ లలో మిగతా వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. ఈ ఫోన్ లో మొత్తం నాలుగు కెమెరాలు ఉండేలా రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధాన కెమెరా 64 మెగా పిక్సెల్ గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఫ్రంట్ కెమెరా 20 మెగా పిక్సల్ గా ఉన్నట్లు సమాచారం. అది కూడా పాప్అప్ సెల్ఫీ తరహా ఫీచర్లో అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ సంబంధించి 128 జీబీ, 256 జీబీ,  512 జీబీ లలో వివిధ మెమొరీ వేరియంట్లను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్ లో వివిధ సెన్సార్ల తో పాటు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4400 mah బ్యాటరీ ఉండనుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసేలా ఈ ఫోన్ ని రూపొందించారు. ముఖ్యంగా ఈ ఫోన్ కు సంబంధించి 5g ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.



ఈ స్పెసిఫికేషన్స్ అన్ని మొదటగా రెడ్ మీ 40 కి పోటీమోడల్ కు ఉన్నట్లు సమాచారం తెలిసింది. కానీ, ఆ మోడల్ స్పెసిఫికేషన్లతో పాటు మిగతా విషయాలు అన్ని రెడ్ మీ కే 30 అల్ట్రా తో సరితూగాయి. ఆగస్టు 14 న ఈ మొబైల్ తో పాటు రెడ్ మీ వాచ్ కూడా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. గత మూడు సంవత్సరాల నుండి భారతదేశంలో రెడ్ మీ సంస్థ మొబైల్ రంగంలో సేల్స్ పరంగా మొదటి స్థానంలో నిలబడుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: