షావోమి రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ ఫోన్ లో ఈ రోజు సాయంత్రం నుండి భారతీయులు కొనుగోలు చేసుకోవచ్చని చైనీస్ మొబైల్ సంస్థ తెలిపింది. అమెజాన్, ఎంఐ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా వినియోగదారులు ఈ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఆగస్టు 17 వ తేదీ రోజున ఈ మొబైల్ ఫోన్లు విడుదలయ్యాయి కానీ లక్షల సంఖ్యలో మొబైల్ ఫోన్లు అమ్ముడుపోవడంతో మళ్ళీ ఈ రోజు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. బడ్జెట్ సెగ్మెంట్ లో వినియోగదారులకు లభిస్తున్న రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ ఫోన్స్ కి సంబంధించిన లాంచ్ ఈవెంట్ ను ఆన్లైన్ లోనే నిర్వహించారు.


ఎంట్రీ వేరియంట్ గా రూ.9,999 లభించునున్న రెడ్మీ 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ లో 4జీబీ రామ్ + 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ వస్తుంది. 4జీబీ రామ్ + 128జీబీ ఇంటర్నల్ మెమొరీ తో వచ్చే రెడ్మీ 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ధర రూ. 11, 999. ఒకవేళ వినియోగదారులు అమెజాన్ లో కొనుగోలు చేసుకుంటే వారికి 5 ఆప్షన్ల వరకు లభించనున్నాయి. నో క్యాస్ట్ ఈఎంఐ ద్వారా మొబైల్ ఫోన్ ను తగ్గించుకోవచ్చు. హెచ్ఎస్బిసి కార్డు పై ఐదు శాతం వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.


స్పెసిఫికేషన్ల గురించి చెప్పుకుంటే రెడ్మీ 9 ప్రైమ్ లో 6.5 ఇంచుల ఎల్సిడి ప్యానల్ ఫుల్ హెచ్.డి డిస్ప్లే ఇవ్వబడింది. ఎల్సిడి ప్యానల్ వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో మొబైల్ ఫోన్ డిస్ప్లే వస్తుంది. ఇక ఈ మొబైల్లో మీడియా టెక్ హీలియో జి80 ప్రాసెసర్ ఇవ్వబడింది. 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5020 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రెడ్మీ 9 ప్రైమ్ లభిస్తుంది. కానీ మొబైల్ ఫోన్ బాక్స్ లో 10 వాట్ చార్జర్ మాత్రమే లభిస్తుంది. ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోవాలనుకుంటే బయట 18 వాట్ చార్జర్ కొనుక్కోవాల్సి ఉంటుంది. మీ మొబైల్ ఫోన్ లో యుఎస్బి-సి పోర్ట్ లభిస్తుంది. ఇకపోతే రెడ్మీ 9 ప్రైమ్ 13 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సల్ మైక్రో కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వబడ్డాయి. నాలుగు రకాల రంగులలో లభించుననున్న ఈ ఫోన్ యొక్క బరువు 198 గ్రాములు.

మరింత సమాచారం తెలుసుకోండి: