రెడ్ మీ నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ల సేల్ ప్రారంభం అయ్యింది. ఈ ఫోన్ల గురించి పూర్తి వివరాలు ఇవే... ఈ రెండు ఫోన్లలోనూ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ ని అందించడం జరిగింది. ఈ ఫోన్స్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ని కలిగి ఉన్నాయి. రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ లో మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ధర విషయానికి వస్తే..... 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 , 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,599గానూ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.19,999గా ఉంది.

అదే రెడ్ మీ నోట్ 9 ప్రోలో మాత్రం రెండు వేరియంట్లు  ఉన్నాయి.  4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.13,999, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్ స్టెల్లార్ బ్లాక్ కలర్స్  లో ఏదైనా కొనుక్కోవచ్చు.

రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్లు:

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ గా ఉండగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లు కలిగి ఉంది. అలానే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5,020 ఎంఏహెచ్ గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కూడా అందించారు. 4జీ వోల్టే, వైఫై 802.11ac, బ్లూటూత్ v5.0, ఇన్ ఫ్రారెడ్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో విశేషం.

రెడ్ మీ నోట్ 9 ప్రో స్పెసిఫికేషన్లు:

వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్, 2 మెగా పిక్సెల్ క్వార్టెనరీ సెన్సార్ లను కూడా ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5,020 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 4జీ వోల్టే, వైఫై 802.11ac, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: