ఇండియాలో శామ్‌సంగ్ ఫోన్స్ కి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక శామ్‌సంగ్ నుండి ప్రతిష్టాత్మక ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్2 5జీ ప్రీ-బుకింగ్‌ల‌ను ప్రారంభించారు. అయితే శామ్‌సంగ్ ఈ నూత‌న ఫోల్డ్2 5జీ ఫోన్‌ను దేశంలో రూ.1,49,999కు విక్ర‌యించ‌నుంది. ఇక నెక్స్ట్ జ‌న‌రేష‌న్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్ సెప్టెంబర్ 14న‌ మధ్యాహ్నం 12 గంటలకు శామ్‌సంగ్‌ ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865+ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని నిపుణులు తెలిపారు. ఇది అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌ను క‌లిగి ఉందని అన్నారు.

ఇండియాలో వినియోగదారులు ఈ గెలాక్సీ జెడ్ ఫోల్డ్2 5జీను సోమవారం నుంచి శామ్‌సంగ్.కామ్‌లో ప్రముఖ రిటైల్ దుకాణాల్లో ప్రీ-బుక్ చేసుకోవచ్చునన్నారు. ఇది మిస్టిక్ బ్లాక్, కాంస్య రంగుల్లో వ‌స్తుందని తెలిపారు. దేశంలో దీని ధ‌ర రూ.1,49,999గా నిర్ణ‌యించారు. శామ్‌సంగ్  గెలాక్సీ జెడ్ ఫోల్డ్2 5జీ ఆండ్రాయిడ్ 10లో వన్ యూఐ 2.5తో నడుస్తుందన్నారు. 7.6-అంగుళాల పూర్తి-హెచ్‌డీ + ఫోల్డబుల్, డైనమిక్ అమోలేడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉందన్నారు. 816x2,260 పిక్సెల్స్ రిజల్యేష‌న్ 6: 25-9 కారక నిష్పత్తితో 6.2-అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ ప్లే కూడా ఉందన్నారు.

అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865+ఎస్‌ఓసీ 12GB ఎల్పీడీడీఆర్ 5జీబీ ర్యామ్‌తో పనిచేస్తుందన్నారు.  ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని తెలిపారు. ఇది ఎఫ్/1.8 లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ సెన్సార్, ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 12 ఎంపీ సెన్సార్, ఏఎఫ్/2.4 టెలిఫోటో లెన్స్‌తో అద‌న‌పు 12ఎంపీ సెన్సార్‌ను క‌లిగి ఉందన్నారు. కవర్ స్క్రీన్‌లో 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌లతో పాటు ఎఫ్/2.2 లెన్స్‌తో మెయిన్ డిస్‌ప్లే ఉంది. 24,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్‌కు మద్దతు ఇస్తుందని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: