రియల్ మీ నార్జో 20 ప్రో ధర విషయానికి వస్తే..... ఇందులో రెండు వేరియంట్లలు అందుబాటులో ఉండగా.... 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. అదే 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. రంగులు అయితే బ్లాక్ నింజా, వైట్ నైట్ రంగుల్లో దీనిని కొనుగోలు చేయవచ్చు.
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ అల్ట్రా స్మూత్ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై రియల్ మీ నార్జో 20 ప్రో పని చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్క భాగంలో ఉంది. బ్యాటరీ సామర్థ్యం వచ్చేసి 4500 ఎంఏహెచ్ గా ఉంది.