ఒప్పో స్మార్ట్ ఫోన్ కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకు రావడం జరిగింది. ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చిన ఏ33(2020)ని లాంచ్ చేయడం కూడా జరిగింది. మరి ఆ ఫోన్ కి సంబంధించిన పూర్తి  వివరాలు ఇవే.... ఒప్పో ఏ33(2020) స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ క్వాల్ కాం స్నాప్  డ్రాగన్ ప్రాసెసర్‌ పై  పనిచేయనుంది. అలానే ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే...... వెనకవైపు మూడు కెమెరాల సెటప్, ముందువైపు 13 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. దీంతోపాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరాను ఫోన్ ముందు వైపు అందించారు. హోల్ పంచ్ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు. అలానే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లేను అందించారు. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.  

ఒప్పో ఏ33 ధర విషయానికి వస్తే..... ధరను 22.99,000 ఇండోనేషియా రూపాయలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.11,300) నిర్ణయించారు. అలానే స్టోరేజ్ వచ్చేసి.... 4 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. రంగుల్లోకి వస్తే..... మూన్ లైట్ బ్లాక్, మింట్ క్రీమ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. మన దేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కంపెనీ తెలపలేదు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: