కొత్త స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. ఇప్పుడు నోకియా 10ను కంపెనీ రూపొందిస్తుందని వార్తలు వస్తున్నాయి. నోకియామొబ్ తెలిపిన విషయాల ప్రకారం వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో టాప్-3 మొబైల్ బ్రాండ్స్‌ లో ఒకటిగా నిలవడానికి నోకియా ప్రణాళికలు రచిస్తుంది. ఇది ఇలా ఉండగా దీని స్పెసిఫికేషన్లు, ఎప్పుడు లాంచ్ అవుతుందనే సంగతి మాత్రం కంపెనీ తెలపలేదు. ప్రధానమైన మార్కెట్‌గా నోకియా గుర్తించింది. దీంతో పాటు గూగుల్‌ తో భాగస్వామ్యం వైపు కూడా నోకియా చూస్తోందని నోకియా మొబ్ షేర్ చేసిన డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది.

అలానే  గూగుల్ పిక్సెల్ ఫోన్ల తో సమానమైన ఫోన్లను గూగుల్‌ తో భాగస్వామ్యం ద్వారా రూపొందించాలని నోకియా భావిస్తోంది. గూగుల్ నోకియాలో రెండు నెలల క్రితమే పెట్టుబడి పెట్టింది. గూగుల్‌తో భాగస్వామ్యాన్ని బలంగా చేసుకుని మార్కెట్లో ముందుకు పోవాలని నోకియా అనుకుంటోంది. అలానే వేరే బ్రాండ్లు విడుదల చేసే ఫోన్లతో ఎప్పుడూ పోల్చుకోకూడదని కూడా ఈ డాక్యుమెంట్‌లో ఉంది. నోకియా ఇప్పటికే గూగుల్ నమ్మకాన్ని పొందింది. గూగుల్ పాత్ర 95 శాతం ఉంటుందని, ప్రతి ధరల స్థాయిలో వీటినే గూగుల్ పిక్సెల్స్‌గా పరిగణిస్తారని  అందులో ఉంది.
 
నోకియా 9.3 ప్యూర్‌వ్యూ స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే.....  క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు సమాచారం. అలానే దీని అంచులు సన్నగా ఉన్న 120 హెర్ట్జ్ డిస్ ప్లే ఇందులో ఉండనుందని తెలుస్తోంది. ఇక కెమెరా విషయానికి వస్తే.... 8 మెగా పిక్సెల్ లేదా 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇందులో అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  అండర్ డిస్ ప్లే కెమెరా ఉండనుందని లీకుల ద్వారా తెలుస్తోంది. మరి ఎప్పుడు నోకియా 10  వస్తుందో తెలియలేదు. కొద్దీ రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: