ప్రస్తుతం ప్రపంచం అంతా మొబైల్ పై ఆధారపడి ఉంటుందని అంటారు. అది నిజమే అని అందరికీ తెలిసిందే.. ప్రపంచంలోని అన్ని విషయాలు అర చేతిలో కనిపిస్తుండటంతో ప్రతి ఒక్కరూ వయసు తో సంబంధం లేకుండా అందరూ టెక్నాలజీని వాడుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొబైల్ కంపెనీ వాళ్ళు కూడా కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇటీవల
దసరా సందర్భంగా చాలా రకాల ఫోన్లు
మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. వాటికి మంచి డిమాండ్ ఉంది.
తాజాగా ఇప్పుడు మరోక
ఫోన్ మార్కెట్ లో సందడి చేస్తోంది. అదే హానర్
ఫోన్ ఇప్పుడు
మార్కెట్ లోకి విడుదల అయ్యింది. హానర్ 10ఎక్స్ లైట్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతానికి ఈ
ఫోన్ సౌదీ అరేబియాలో లాంచ్ అయింది. ఇందులో కిరిన్ 710 ప్రాసెసర్ అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాలు అందించడం విశేషం. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్‌గా ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. 4 జీబి ర్యామ్ మరియు 128 జిబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. దీని ధర ఇండియాలో రూ. 15,900 ఉంటుందని అంటున్నారు.
వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సెన్సార్‌ను అందించారు. దీంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి.. దాంతో పాటు ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 22.5W ఫాస్ట్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. .. ఈ
ఫోన్ బరువు 206 గ్రాములు ఉంటుంది. ఈఫోనే గురించి టాక్ పాజిటివ్ గా రావడంతో
మార్కెట్ లో
ఫోన్ కు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు..