పండగ సీజన్ వచ్చిందంటే కొత్త సంతోషాలతో పాటుగా వస్తువుల పై అదిరిపోయే ఆఫర్లు కూడా అందుబాటులోకి వస్తుంటారు. ముఖ్యంగా ఎలెక్ట్రానిక్ వస్తువుల విషయంలో అయితే చెప్పనక్కర్లేదు రోజుకో ప్రొడక్ట్ ఆన్లైన్
దర్శన మిస్తున్నాయి.. మొబైల్ ఫోన్లు అయితే మాత్రం చెప్పనక్కర్లేదు గంటకో కంపెనీ కొత్త ఫీచర్లు ఉన్న ఫోన్లను
మార్కెట్ లోకి వదులు తున్నారు. తాజాగా మరో కంపెనీ కొత్త
ఫోన్ ను పరిచయం చేసింది. అదే
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ.. ఎంఐ 11
స్మార్ట్ ఫోన్ రూపొందించనుందని తెలుస్తోంది. ఈ
ఫోన్ ఇప్పుడు గీక్‌బెంచ్‌లో కనిపించింది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 875 ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నట్లు ఈ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను ఇందులో అందించనున్నట్లు సమాచారం.
ఈ
ఫోన్ లోని ప్రత్యేకతల విషయానికొస్తే..ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ కూడా దీని గురించిన లీకులను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 875 ప్రాసెసర్‌తో వచ్చే మొదటి రెండు ఫోన్లలో ఈ
ఫోన్ కూడా ఒకటి అని తెలిపారు. అంతేకాకుండా ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉండనుందని పేర్కొన్నారు. ఇందులో ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉండనుందట.. అయితే లీక్ అయిన వివరాల ప్రకారం చూస్తే ఈ
ఫోన్ పేరు ఎంఐ 11 లేదా ఎంఐ ప్రో 11 ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.
ఫోన్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 875 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. అయితే ఈ లిస్టింగ్‌లో అడ్రెనో 660 జీపీయూ ఇందులో ఉండనున్నట్లు పేజ్ సోర్స్ కోడ్ ద్వారా తెలిసింది. ఈ
ఫోన్ గురించి అధికారంగా ఎటువంటి సమాచారాన్ని అందించలేదు కానీ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్లలో ఎంఐ 10 సిరీస్ కూడా ఉంది. కాబట్టి క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 875 విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది.. వచ్చే నెల
డిసెంబర్ 1 న ఈ
ఫోన్ ను
మార్కెట్ లోకి లాంఛ్ చేయనున్నారని సమాచారం. ఎంఐ లో ఇప్పటివరకు వచ్చిన ఫోన్లు అన్నీ కూడా మంచి ఫీచర్లు ఉండటంతో ఇప్పుడు రానున్న
ఫోన్ కూడా బాగుంటుందని మొబైల్ ప్రియులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. మరి ఈ
ఫోన్ రేంజు లో ఉంటుంది.. ఎంత ధర ఉంటుంది చూడాలి..