ప్రముఖ దిగ్గజ కంపెనీ నోకియా కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. అంతేకాదు అదిరిపోయే ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.ఇటీవల కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు మరో ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆ ఫోన్ కు మార్కెట్ మంచి టాక్ ను సంపాదించుకుంది.. అయితే ఆ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..



ఇప్పటి వరకు వచ్చిన నోకియా ఫోన్లు అన్నీ కూడా ది బెస్ట్ అయ్యాయి..ఇప్పటి వరకు ఈ ఏడాదిలో చాలా ఫోన్లను నోకియా మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆ ఫోన్లు నోకియా సీ1 ,నోకియా సీ2,ఇటీవల నోకియా సీ3 మొబైల్స్ ను లాంఛ్ చేసింది.ఇప్పుడు ఈ నెల 15 న రానున్న ఫోన్ సీ 4 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆన్ లైన్ లో ఫీచర్స్ లీక్ అయ్యాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.. తాజాగా, నోకియా టీఏ-1335 4జీ స్మార్ట్ ఫోన్ టెనా వెబ్ సైట్లో కనిపించింది. ఆండ్రాయిడ్ 10 గో ఆపరేటింగ్ సిస్టంపైనే ఇది కూడా పనిచేయనుంది. డిసెంబర్ 15వ తేదీన లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్ ఇదే కానుందని సమాచారం.  



ఇకపోతే ఈ ఫోన్ డిస్ప్లే 5 అంగుళాల పైన ఉంటుంది. ఈ ఫోన్ లాంఛ్ గురించి ప్రత్యేకంగా కంపెనీ వెబ్ సైట్ లో వెల్లడించింది. ఇప్పుడు మరో ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది.. నోకియా టీఏ-1335 4జీ స్మార్ట్ ఫోన్ టెనా వెబ్ సైట్లో కనిపించింది. ఆండ్రాయిడ్ 10 గో ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పని చేయనుంది..డిసెంబర్ 15వ తేదీన లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్ ఇదే కానుందని సమాచారం. ఇకపోతే క్వాడ్ కోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్  ఇందులో ఉంటుంది. వెనకవైపు 5 మెగాపిక్సెల్, ముందువైపు 3 మెగాపిక్సెల్ కెమెరాను ఇందులో అందించనున్నారు. 2500 ఎంఏహెచ్ బ్యాటరీ .. నేవి బ్లూ,షాంపేన్, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. అయితే ధర మాత్రం 7 వేల లోపు ఉంటుందని అంచనా.. 

మరింత సమాచారం తెలుసుకోండి: