ఆన్ లైన్ లో ఈ ఫోన్ ఫీచర్లు కనిపించాయి..6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. 1.8 గిగాహెర్ట్జ్ దగ్గర క్లాక్ అయ్యే ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండే అవకాశం ఉంది. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు అని కంపెనీ వెల్లడించింది. వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం..
ముందువైపు ఉన్న కెమెరా మాత్రం 5 మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నట్లు తెలుస్తుంది. గెలాక్సీ ఎం02 స్మార్ట్ ఫోన్ కూడా ఆన్ లైన్‌లో కనిపించింది. ఈ ఫోన్ గీక్ బెంచ్‌లో కూడా కనిపించింది. ఇందులో కూడా ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్ ఉండనున్నాయి.. ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 10 మైక్రో ప్రాసెసర్ పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు అంటే కెమెరా, లుక్ మాత్రమే ఫోన్ రేంజ్ ను పెంచింది. కొన్ని వెరీయంట్లలో కూడా ఫోన్ ను లాంఛ్ చేయనున్నారు. మార్కెట్ లోకి రాక ముందే ఫోన్ కి గిరాకీ బాగా పెరిగినట్లు తెలుస్తుంది..