365 రూపాయలతో ఏడాదిపాటు 250 నిమిషాల ఉచిత కాల్స్, 100 ఎస్ఎంఎస్లు, 2 జిబి డేటా రోజు చొప్పున ప్రకటించింది. ఇంత పెద్ద భారీ ఆఫర్ ను ప్రకటించడం ఇదే మొదటిసారి. అయితే ఇందులో ఒక మెలిక కూడా ఉంది. కాల్స్ మాత్రం ఏడాది పాటు ఉచితంగా వాడుకోవచ్చు. కానీ 100 ఎస్ఎంఎస్లు, 2 జీబీ డేటా మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే పరిమితమని ప్రకటించింది బిఎస్ఎన్ఎల్ సంస్థ. అయితే ఇప్పుడు సరికొత్త పోస్ట్పెయిడ్ ప్లాన్ల తో మన ముందుకు వచ్చింది బిఎస్ఎన్ఎల్ అవేంటో ఇప్పుడు చూద్దాం.
రూ.199 పోస్ట్పెయిడ్ ప్లాన్ ద్వారా బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు 300ఎం బి ఉచిత డేటా అందిస్తోంది. ఈ సర్వీస్ 60 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులోభాగంగా మొత్తం 25 జి బి వరకు డేటా లభించనుంది.
రూ.798 పోస్ట్ పెయిడ్ ప్లాన్ పై బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు, రోజుకు 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇది బిఎస్ఎన్ఎల్ పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్స్. ఇవేకాకుండా కస్టమర్లకు 50 జిబి డేటా నుంచి 70 జిబి డేటా వరకు పొందవచ్చు.
రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్ పై బిఎస్ఎన్ఎల్ కస్టమర్ లకు అపరిమిత వాయిస్ కాలింగ్ తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 2025 జిబి డేటా వరకు లభిస్తుంది.