ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఇప్పటి వరకు ఈ కంపెనీ విడుదల చేసిన మొబైల్ ఫోన్లు యువత ఆకట్టుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. అయితే ఇప్పుడు మరో ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఆ ఫోన్ విశేషాలు ఎంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం.. 


తన బడ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎంఓ2 ను భారత్‌లో ఫిబ్రవరి రెండో తేదీన విడుదల చేయనున్నది. వచ్చే మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటిగంటకు విపణిలో అడుగు పెట్టనున్నది గెలాక్సీ ఎంవో2. లైవ్ స్ట్రీమ్ ‌లో దీన్ని లాంచ్ చేయనున్నారు. గతేడాది జూన్‌ లో శ్యామ్‌సంగ్ ఆవిష్కరించిన గెలాక్సీ ఎంఓ1కు కొనసాగింపుగా ఎం సిరీస్‌ లో భాగంగా వినియోగ దారులకు చౌక ధరలో ఈ ఎంవో2 ఫోన్ వస్తోంది. దీని ధర రూ.7000 లోపు ఉంటుందని భావిస్తున్నారు. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎంవో1 ఫోన్ ధర రూ.8,999 కాగా, సింగిల్ 3జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. గతేడాది డిసెంబర్‌లో శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎంవో1 ఫోన్ ధరను రూ.7,499కి నిర్దారించారు. 



ఇకపోతే అదిరిపోయే ఫీచర్లు ఈ ఫోన్ ఉండటంతో మార్కెట్ లో రోజు రోజు డిమాండ్ చేస్తున్నారు. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎంవో2 ఫోన్ 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ వీ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో వినియోగదారుల ముంగిట్లోకి వస్తోంది. యూరప్‌లో గత నవంబర్‌లో ఆవిష్కరించిన గెలాక్సీ ఏఓ2 మోడల్ ఫోన్‌ను రీ బ్రాండ్ చేసి గెలాక్సీ ఎంవో2గా విడుదల చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ లో ఈ ఫోన్ ను చూసిన యువత కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు..మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఏ రేంజ్ టాక్ ను అందుకుంటుంది చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: