స్మార్ట్ ఫోన్లలో స్టార్
ఫోన్ ఐఫోన్.. ప్రముఖ కంపెనీ యాపిల్ ఈ ఫోన్లకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఈ ఫోన్లకు
మార్కెట్ లో మంచి టాక్ ఉంది. యాపిల్
ఫోన్ ను ఒక్కసారి అయిన వాడాలని జనాలు అనుకుంటారు. అందుకే
స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేర్ లో
ఆపిల్ ఏకంగా డబుల్ షేర్ ను సంపాదించుకుంది.
డిసెంబర్ క్వార్టర్ కల్లా ముగిసిన సేల్స్ ను చూస్తే
ఆపిల్ షేర్ గణనీయంగా పెరగటం విశేషం..ఇకపోతే గత ఏడాది
అక్టోబర్ ,
డిసెంబర్ లలో
ఐఫోన్ 11,ఐఫోన్ 12,
ఐఫోన్ఎక్సార్ ఫోన్లు భారీ స్థాయి లో అమ్ముడు పోవడం తో ఈ రికార్డును సొంతం చేసుకుంది.
ఐఫోన్ 12 ఆలస్యంగా లాంచ్ అయినప్పటికీ కనివినీ ఎరుగని రేంజ్ లో అమ్ముడుబోయాయి. 1.5 మిలియన్ల ఫోన్లను యాపిల్ మన దేశంలోకి ఎగుమతి చేయగా ఫెస్టివ్ సీజన్ సేల్స్ లో ఇవి మన కస్టమర్లను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ టెక్ జెయింట్
బిజినెస్ 2020లో 60 శాతానికి ఎగబాకింది. 2020లో మొత్తం 3.2 మిలియన్ల లాభాలను అందుకుంది.ఆపిల్ ఇతర ప్రాడక్ట్స్ అయిన ఐప్యాడ్లు కూడా బాగా అమ్ముడుపోయాయి.
2020 మొత్తం ఏడాదిలో అయిన సేల్స్ కంటే ఇది 17శాతం ఎక్కువ. ఇక గతేడాది తో పోల్చితే ఇది మరింత ఎక్కువ. గత ఏడాదికి అత్యధిక స్థాయిలో అమ్ముడు పోయిన
ఫోన్ గా
ఐఫోన్ రావడం గ్రేట్ అంటూ కంపెనీ వెల్లడించింది.ఇక
5g ఫోన్లలో యాపిల్ కు ధీటుగా ఏ ఇతర సంస్థలు పెద్దగా కస్టమర్లను ఆకట్టుకోలేక పోవటం, ఆవిష్కరణల విషయానికి వస్తే యాపిల్ అత్యుత్తమంగా ఉండటం వంటివి ఈ కంపెనీకి కలిసి వస్తున్న అంశాలుగా మారాయి. యాపిల్ ప్రాడక్ట్స్ స్టేటస్ సింబల్ గా భావిస్తున్న యాపిల్ యువతను బాగా ఆకట్టుకోవడం తో ఇది సాధ్య మైందని తెలుస్తుంది.