వివో కంపెనీ నుంచి మార్కెట్ లోకి ఇప్పటి వరకు వచ్చిన అన్ని మొబైల్ ఫోన్లు యువతను బాగా ఆకట్టుకున్నాయి.వాటి స్మార్ట్ ఫీచర్స్ అన్నీ విధాలుగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపయోగ పడతాయి. వివో ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో యువతకు ఇంకాస్త దగ్గరవడం కోసం ఒకేసారి రెండు ఫోన్లను విడుదల చేయనుంది. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. వివో తన ఎక్స్50 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌నను ఎక్స్60 సిరీస్‌తో పాటు మనదేశంలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.


మార్చి నెలాఖరులో కానీ, ఏప్రిల్ ప్రారంభంలో కానీ ఈ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వివో ఎక్స్50, వివో ఎక్స్50 ప్రోలు మనదేశంలో గతేడాది జులైలో మనదేశంలో లాంచ్ అయ్యాయి. వివో ఎక్స్50 ప్రో ప్లస్ ఇప్పటివరకు మనదేశంలో లాంచ్ కాలేదు. ఇక ధర విషయానికి వస్తే వివో ఎక్స్50 ప్రో ప్లస్ ధర మనదేశంలో రూ.40 వేల రేంజ్‌లో ఉండనుందని తెలుస్తోంది. అయితే వివో ఎక్స్60 సిరీస్ గురించి కానీ, వివో ఎక్స్50 ప్రో ప్లస్ గురించి కానీ కంపెనీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. వివో ఎక్స్60, ఎక్స్60 ప్రో స్మార్ట్ ఫోన్లు చైనాలో గతేడాది డిసెంబర్‌లో లాంచ్ అయ్యాయి.


వివో ఎక్స్ 60 ప్రో ప్లస్ కూడా రెండు నెలలు ముందే లాంఛ్ అయ్యింది.క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 10.5 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, 13 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ కెమెరా, 8 మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా, 8 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాను ఇందులో అందించారు.. ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్ ఉంటుంది.బ్యాటరీ సామర్థ్యం 4315 ఎంఏహెచ్ గా ఉంది. 44W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.. ఇకపోతే 181.5 బరువుతో ఈ ఫోన్ ను ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: