ఆధార్ కార్డ్ ప్రస్తుత కాలంలో  ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఆధార్ కార్డు లేని వారంటూ ఎవరూ ఉండరు. ఆధార్ కార్డ్ అనేది ఒక మనిషి యొక్క బయోడేటా మొత్తం చూపించగలదు. అందులో భాగంగా డిజిటల్ ఇండియా ని ప్రోత్సహించడానికి,ప్రభుత్వం 2017 లో ఎమ్ ఆధార్ యాప్ ను విడుదల చేసింది. దీని ద్వారా మన ఆధార్ కార్డు లో ఏవైనా తప్పులు ఉంటే, మన ఇంటి దగ్గర నుంచి  మార్చుకునే విధంగా అవకాశం కల్పించింది. కరోనా సమయంలో మనం బయటికి వెళ్లకుండా ఆధార్ కార్డు లో తప్పులు సరి చేసుకోవచ్చు.


ఈ యాప్ ను uidai ద్వారా రూపొందించబడింది. ఈ యాప్ కు uidai కొత్త యాప్ తీసుకువచ్చింది.  ఈ కొత్త యాప్ ద్వారా ఐదుగురు ఆధార్ కార్డు ప్రొఫైల్ లను ఇప్పుడు m Adhaar లో చేర్చే అవకాశం ఏర్పడింది. యు.ఐ.డీ.ఎ.ఐ.ఆధార్ ఈ విషయాన్ని తెలియజేసింది. అంతకుముందు ఎం ఆధార్ యాప్ ద్వారా గరిష్ఠంగా ముగ్గురు సభ్యులను మాత్రమే చేర్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మరో ఇద్దరి సభ్యులను చేర్చుతూ మొత్తం ఐదు మందిని ఈ ఆధార్ లో చేర్చుకోవచ్చు.


ఈ యాప్ ద్వారా పేరు, తేదీ, లింగం మరియు చిరునామా,  ఫోటో, ఆధార్ నెంబర్ లింక్ లను కలిగి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎమ్ ఆధార్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ను వినియోగించడం ద్వారా వారు ప్రొఫైల్ ఫోటో ను కూడా అప్లై చేసుకోవచ్చు.  మీరు గతంలో వాడే యాప్ అయితే డిలీట్ చేసి,ఇప్పుడు కొత్తగా వచ్చిన  ఎం ఆధార్ యాప్ ను ప్లే స్టోర్ ద్వారా ఇంస్టాల్ చేసుకోండి.


ఇటీవల mAdhaar యాప్ ఫీచర్స్ లో పలు మార్పులు చేసింది UIDAI. అందుకే ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు పాత యాప్ ని డిలీట్ చేసి, ప్లే స్టోర్ లో లభ్యమవుతున్న కొత్త యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: