ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరూ PDF ఫైల్ ను ఏదో విధంగా వాడుతూనే ఉంటారు. అందులో ముఖ్యంగా డాక్యుమెంట్ కోసం వాడుతూనే ఉంటారు . అలాగే వాట్సాప్ లో ముఖ్యమైన ఫోటోస్ సెండ్ చేసుకోవడానికి డాక్యుమెంటరీ రూపంలో నుంచి పీడీఎఫ్ రూపంలోకి మార్చి , సెండ్ చేయవచ్చు. PDF ( పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ ) ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉపయోగించుకున్న ఫార్మేట్ అని మీకు తెలుసా..? పీ డీ ఎఫ్ ఫైల్ ద్వారా ఎటువంటి మార్పు లేకుండా, ఎల్లప్పుడు ఒకే విధంగా కనిపించడం గమనార్హం. ఇప్పుడు పీడీఎఫ్ ఫైల్ నుండి వర్డ్ ఫైల్ గా ఎలా మార్చాలో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.
పీ డీ ఎఫ్ ఫైల్ లో మార్పులు చేయడం అంత సులువైన విషయమేం కాదు. అందుకే కొన్ని మార్పుల కోసం పీ డీ ఎఫ్ ఫైల్ ను WORD FILE గా మార్చబడుతుంది. వాస్తవానికి ఇది సులువైన మార్గం కాదు. మీకు PDF లో లభించే ఫైల్స్ వర్డ్ ఫైల్ లో మార్చడానికి కొన్ని సమస్యలు ఉండవచ్చు. కొన్ని పద్ధతులను ఉపయోగించి పీ డీ ఎఫ్ ఫైల్ ను వర్డ్ ఫైల్ గా మార్చవచ్చు..అది ఎలానో చూద్దాం.
PDF ఫైల్ ను Word ఫైల్ గా మార్చడం ఎలా..?
మీ సిస్టం లో ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండా మీరు ఏ pdf ఫైల్ అయినా word ఫైల్ గా సులభంగా మార్చవచ్చు. మనం వాడే ఎటువంటి కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ లో కూడా ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు.
మీరు మీ సిస్టం సర్చింగ్ బార్లో పీ డీ ఎఫ్ అని టైప్ చేయగానే, చాలా toolbars పొందవచ్చును. కానీ వాటిలో మీరు కొన్ని వాటి వివరాలు ఇవ్వాలి. దీనికి మీరు ఎటువంటి ఐడీలను ఇవ్వవలసిన అవసరం లేదు. మీరు ఫైల్ ని సులభంగా మార్చవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు www.hipdf.com వెబ్ సైట్ కి వెళ్ళాలి. మీరు పీ డీ ఎఫ్ ఫైల్ ను ఎంచుకొని, ఏదైతే వర్డ్ గా మార్చాలి అని అనుకుంటున్నారో దానిని మాత్రమే ఎంచుకున్న తర్వాత, మీరు convert పైన క్లిక్ చేయాలి. మరియు ఫైల్ మార్చే వరకు వేచి ఉండాలి. ఈ ఫైల్ వర్డ్ ఫైల్ గా మార్చబడిన వెంటనే, మీ కంప్యూటర్ లో కూడా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వర్డ్ ఫైల్ ను కూడా సవరించుకోవచ్చు. ఆ తరువాత దానిని మరోసారి పీ డీ ఎఫ్ గా మార్చ వలసి వస్తే కూడా సులభంగా మార్చుకోవచ్చు.