ప్రస్తుతం మన దేశంలో ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న వారికి రేషన్ కార్డు ఉంటుంది. ఆ రేషన్ కార్డు కొరకు సంబంధించిన సమాచారం కోసం ఒక యాప్ కనిపెట్టింది కేంద్రం. ఆ యాప్ లో మీరు రేషన్ షాప్ కెళ్ళి తీసుకున్నారా..లేదా..అనే సమాచారం కూడా ఉంటుందట. అంతేకాకుండా  ఈ సమాచారం ఇంట్లో కూర్చొని కూడా తెలుసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీకు  ఒక స్మార్ట్ ఫోన్ కావాలి. లేదంటే మీ కుటుంబ సభ్యుడు ఫోన్ తో కూడా ఈ పని చేయవచ్చు.

కరోనా మహమ్మారిని నివారించడానికి విధించిన లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం వన్ రేషన్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టింది. లాక్ డౌన్ సమయంలో ప్రజలు రేషన్ పొందడంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా, ఆహారం కోసం ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఒక యాప్ ను ప్రారంభించింది.

ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. దీని ప్రారంభించడానికి ప్రత్యేక కారణం ఏంటంటే.. వలస కార్మికులు వీరు ఏ నగరంలోనైనా రేషన్ తీసుకోవడానికి ఈ సౌకర్యం కల్పించారు. ముందుగా మీరు ప్లే స్టోర్ కి వెళ్ళాలి. ప్లే స్టోర్ లో "మేర రేషన్" అనే యాప్ ని డౌన్లోడ్ చేయండి. తరువాత దాన్ని ఇన్స్టాల్ చేసి,  మీ సమాచారాన్ని నమోదు చేసుకోండి.ఇక రిజిస్ట్రేషన్ తర్వాత మీరు ఇక్కడ అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు. దీని ద్వారా చాలా లాభాలు ఉన్నాయి.. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

1).ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డు ద్వారా సులభంగా లాగిన్ అయ్యే సౌకర్యం.
2).మేరా రేషన్ యాప్ తో మీ రేషన్ షాప్ యొక్క ఖచ్చితమైన సమాచారాన్ని పొందుతారు.
3). రేషన్ కార్డు హోల్డర్లు కూడా ఇక్కడ సూచనలు ఇవ్వవచ్చు.
4).ధాన్యం లభిస్తుందని సమాచారం కూడా తెలుసుకోవచ్చు.
5).ప్రస్తుతం ఈ యాప్ హిందీ, ఆంగ్ల భాషకు మద్దతిస్తుంది. రాబోయే కాలంలో 14 భారతీయ భాషలలో కూడా లభించనుందని తెలుపుతున్నారు.
6).ఉపాధి కోసం ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లే కార్మికులు, ఈ యాప్ నుంచి రేషన్ పొందడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
ప్రజలకు కిలో 1-3రూపాయల సబ్సిడీతో ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహారధాన్యాలు అందిస్తుంది  దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వన్ రేషన్ కార్డు పథకంతో అనుసంధానించబడ్డాయి. ఈ పథకం త్వరలో ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేయబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: