రియల్ మీ నార్జో 30లో ఆక్టాకోర్ మీడియాటెక్ MT6785V/CD ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇది హీలియో జీ95 ప్రాసెసర్‌కు మోడల్ నంబర్. దీంతో పాటు 6 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉండనున్నాయి.. ఇక ఈ ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...నార్జో 30ఏ, నార్జో 30 ప్రోల మధ్యలో ఈ ఫోన్ ఉండనుంది. రియల్ మీ నార్జో 30ఏలో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించగా, నార్జో 30 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను అందించారు.
రియల్ మీ నార్జో 30 ప్రోలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉండగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా నిర్ణయించారు. రియల్ మీ నార్జో 30ఏలో కూడా రెండు వేరియంట్లే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా ఉండగా, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా నిర్ణయించారు. ఇలా చూసుకుంటే ఈ ఫోన్లు 15 వేల లోపు ఉండనుంది. మరి సేల్స్ ను ఎలా ఉంటుందో చూడాలి..