ఒప్పో మొబైల్ కంపెనీ పేరు అందరికీ తెలిసిందే..టాప్  మొబైల్ కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల ఫోన్లను అందించింది.. ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీ తో ఉన్న ఫోన్ ను లాంఛ్ చేస్తుంది.ఆ ఫోన్ పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం.. ఒప్పో రెనో 5జెడ్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. రెనో 5 సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. మనదేశంలో గత నెలలో లాంచ్ అయిన ఒప్పో ఎఫ్19 ప్రో ప్లస్ 5జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.


ఇందులో 4310 ఎంఏహెచ్ బ్యాటరీ, 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది..ఈ ఫోన్లలో కేవలం ఒక్క వేరియంట్ ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.29.300 లు గా కంపెనీ నిర్ణయించింది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు.


ఫోన్ యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 90.8 శాతంగానూ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రోషూటర్ కూడా ఇందులో ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను కంపెనీ అందించింది. గతంలో వచ్చిన ఫోన్ల తో పోలిస్తే ఈ ఫోన్ కు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: