ప్రముఖ
స్మార్ట్ ఫోన్ కంపెనీ యాపిల్ నుంచి
ఐఫోన్ 12, 12
మినీ మొబైల్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఐఫోన్లను యాపిల్ సంస్థ పర్పుల్ కలర్‌లో లాంచ్ చేసింది.
ఐఫోన్ పర్పుల్ కలర్‌లో లాంచ్ కావడం ఇదే తొలిసారి కాగా.. 2007 జూలై 29న
ఐఫోన్ మోడల్స్ లో మొట్టమొదటిగా లాంచ్ అయిన
ఐఫోన్ 2జీ బ్లాక్ కలర్ వేరియంట్లో లాంచ్ అయ్యింది. ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చిన ఎన్నో
ఐఫోన్ మోడల్స్ వివిధ రంగులలో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఐఫోన్ 2జీ మోడల్ తర్వాత 2008
జూన్ 9న విడుదలైన
ఐఫోన్ 3జీ మొబైల్ కూడా బ్లాక్ కలర్ లోనే మార్కెట్లో లాంచ్ అయ్యింది. కేవలం ఒకే ఒక్క వారంలోనే ఈ మోడల్ కి సంబంధించి పది లక్షల ఫోన్స్ అమ్ముడుపోయాయి.
ఫాస్టెస్ట్, స్మార్టస్ట్ స్లోగన్ తో విడుదలైన
జూన్ 8, 2009 విడుదలైన థర్డ్ జనరేషన్
ఐఫోన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దాని తర్వాత
జూన్ 7, 2010 లో విడుదలైన
ఐఫోన్ 4 కూడా బ్లాక్, వైట్ కలర్ వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది.
అక్టోబర్ 4, 2011లో విడుదలైన
ఐఫోన్ 4ఎస్ యూనిట్స్ మొదటి 3 రోజుల్లోనే 40 లక్షలకు పైగా అమ్ముడుపోయాయి. ఫిఫ్త్ జనరేషన్
ఐఫోన్ మోడల్ గా వచ్చిన ఈ
ఫోన్ అత్యంత స్టైలిష్ డిజైన్ తో మార్కెట్లో విడుదలై యూజర్లను బాగా ఆకట్టుకుంది. ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్లలో రిలీజ్ అయింది.
సెప్టెంబర్ 21, 2012 న విడుదలైన
ఐఫోన్ 5 యూనిట్స్ 24 గంటల్లోనే 20 లక్షలకు పైగా అమ్ముడుపోయాయి. ఈ
ఐఫోన్ నలుపు / స్లేట్, తెలుపు /
వెండి కలర్ వేరియంట్లలో రిలీజ్ అయింది.
సెప్టెంబర్ 2013 లో విడుదలైన
ఐఫోన్ 5ఎస్ స్పేస్ గ్రే, వైట్, సిల్వర్, గోల్డ్ కలర్ వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. అదే ఏడాది వచ్చిన
ఐఫోన్ 5సి వైట్, బ్లూ, గ్రీన్, యెల్లో,పింక్ రంగులలో అందుబాటులోకి వచ్చింది. 2014 లో వచ్చిన
ఐఫోన్ 6 స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్ వేరియంట్స్ లో రాగా.. 2015 లో రిలీజైనఐఫోన్ 6ఎస్ స్పేస్ గ్రీ, సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్ వేరియంట్స్ లో వచ్చింది. 2016
ఐఫోన్ 7 జెట్ బ్లాక్, బ్లాక్, సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్,
రెడ్ వేరియంట్స్ లో వచ్చి వినియోగదారులను ఆకట్టుకుంది.
2017 విడుదలైన
ఐఫోన్ 8, 8ప్లస్ సిల్వర్ , స్పేస్ గ్రే, గోల్డ్ ,
రెడ్ కలర్స్ లో వచ్చాయి. 2018 లో
ఐఫోన్ ఎక్స్ఆర్ బ్లాక్,
రెడ్, యెల్లో, బ్లూ, కోరల్, వైట్ కలర్ వేరియంట్లలో విడుదలైంది.
2019 లో
ఐఫోన్ ఎక్స్ఎస్ స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్ లలో విడుదల కాగా..
2019 ఐఫోన్ 11 ప్రో మాక్స్ మాట్టే స్పేస్ గ్రీ, మాట్టే సిల్వర్, మాట్టే గోల్డ్, మాట్టే మిడ్నైట్ గ్రీన్ వేరియంట్లలో వచ్చింది. ఇక
2020 లో
ఐఫోన్ 12 ప్రో మాక్స్ సిల్వర్, గ్రాఫైట్, గోల్డ్, పసిఫిక్ బ్లూ కలర్ వేరియంట్లలో విడుదలైంది.