టెక్నాలజీని ఉపయోగించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఇందుకు కారణం ట్రెండ్ అలాగే ఫ్యాషన్ అని చెప్పవచ్చు. ఇక అందుకు తగ్గట్టుగానే ప్రపంచంలోని నలుమూలల్లో ఏదో ఒక సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఇక ఇప్పుడున్న సాంకేతికత ప్రకారం ప్రపంచంలో ప్రతిరోజు ఏదో మరో కొత్త వస్తువులను కనిపెడుతూనే ఉన్నారు. అంతేకాకుండా ఇలాంటి సరికొత్త వస్తువులను వాడుకునేందుకు సర్వదా సిద్ధంగా ఉన్నారు అందరూ .అయితే ఇప్పుడు ఆ టెక్నాలజీ లో భాగంగా సరికొత్త సీలింగ్ ఫ్యాన్ అందుబాటులోకి వచ్చింది. అదేమిటంటే రెక్కలు లేని ఫ్యాన్. ఇక రెక్కలు లేకుండా ఈ ఫ్యాన్ నుంచి మనకు గాలి ఎలా వస్తుంది అని సందేహం కూడా వ్యక్తం చేయవచ్చు. అయితే మనం ఉపయోగించే సాధారణ ఫ్యాన్ ల కంటే, రెట్టింపు వేగంతో గాలి వీస్తుంది. అయితే ఆ ఫ్యాన్ యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
అమెరికాకు చెందిన పలు సంస్థలు ఈ సరికొత్త ఫ్యాన్ లను రూపకల్పన చేశాయి. రెక్కలు లేకుండా ఫ్యాన్ లను తయారు చేసి, తమ దేశ వాసులకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చేశాయి. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ ఫ్యాన్ ల అమ్మకానికి బాగా పునాది వేసుకున్నాయి. మామూలుగా మనం వాడుకునే ఫ్యాన్ లకు మూడు లేదా నాలుగు రెక్కలు ఉంటాయి. ఇక అవి తిరుగుతూ మనకు చల్లని గాలిని ఇస్తుంటాయి.
అయితే ఇప్పుడు ఈ రెక్కలు లేని ఫ్యాన్ థర్మల్ డెస్ట్రాటిఫికేషన్ టెక్నాలజీతో పని చేస్తాయి. వీటికి ఎలాంటి రెక్కలు ఉండవు. కేవలం 50 వాట్ల డీ సీ కరెంట్ మోటార్ మాత్రమే ఉంటుంది. ఇది మనం ఉండే పరిసరాలను బట్టి అందులోని వేడి గాలిని స్వీకరించి, డిస్కుల ద్వారా 360 డిగ్రీల్లో మన చుట్టూ ఉండే నాలుగు మూలలకు చల్లని గాలిని వెదజల్లుతుంది.
ఇకపోతే ఈ ఫ్యాన్ కు చాలా తక్కువ కరెంటు వినియోగపడుతుంది. దీని ఫలితంగా మనకి కరెంట్ బిల్లు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇవి రెండు రకాలుగా లభిస్తున్నాయి.
1). ఎల్ ఈ డి మోడల్ 2) ఎల్ఈడి రహిత మోడల్ వంటి రకాలు లభిస్తున్నాయి. అయితే వీటి ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ ఫ్యాన్ల కనీస ధర ప్రస్తుతం: రూ.22,500 నుంచి రూ.26,000 దాకా ఉంటుంది.