ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరు ఆన్లైన్ బాటనే ప్రారంభిస్తున్నారు. ఏది కావాలన్నా ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసి తీసుకుంటున్నారు.. అయితే ప్రముఖ దిగ్గజ సంస్థలు కూడా ప్రజలను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్తగా అనేక ఆఫర్లను ప్రవేశ పెడుతున్నాయి. అలాంటి వారిలో దిగ్గజ ఈ  - కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కూడా ఒకటి.  ఇక  ఫ్లిప్కార్ట్ ఫ్లాగ్ షిప్ ఫెస్ట్ పేరిట జూన్ 4వ తేదీ నుంచి అనేక స్మార్ట్ఫోన్లను భారీ డిస్కౌంట్ తో  ఆఫర్ కింద వదులుతోంది. అయితే ఈ ఆఫర్ 8వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతోంది. ఆ మొబైల్స్ ఏవో ఒక్కసారి తెలుసుకుందాం.


1).ఐ ఫోన్ 11:ఈ మొబైల్ ఫోన్ ను ఫ్లిప్కార్ట్ లో రూ.5000 రూపాయలు డిస్కౌంట్ తో రూ.49,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇక  మొబైల్ ధర రూ.54,900 కలదు. 6.1- ఇంచుల పరిమాణంతో లిక్విడ్ రెటీనా హెచ్డీ  LCD డిస్ప్లే కలదు. అంతేకాకుండా 12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా కూడా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ మొబైల్ పై 10% డిస్కౌంట్ అదనంగా పొందవచ్చు . ఏదైనా పాత మొబైల్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.14,600 వరకు డిస్కౌంట్ పొందవచ్చు

2). గూగుల్ పిక్సెల్ 4A:ఈ మొబైల్ అసలు ధర రూ.31,999, కాగా ఈ మొబైల్ పై రూ.2000  తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా క్యాష్ బ్యాక్, EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 5.81-ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలిగి ఉంటుంది.


3).MI 10 T 5జీ :ఈ మొబైల్ 5జీ ఆధారంగా రూపొందించబడినది . ఈ మొబైల్ అసలు ధర. రూ.32,999  అయితే ఈ మొబైల్ పై రూ.19,600 వరకు ఎక్సేంజ్ ఆఫర్ కలదు. hdfc బ్యాంకు కార్డులపై రూ.2500 వరకు తగ్గింపు ఉంటుంది. ఈ ఎమ్ ఐ సౌలభ్యం కూడా కలదు. ఈ మొబైల్ 6.67 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలదు. బ్యాటరీ పరంగా 5000 MAH కెపాసిటీ కలదు.


4).సాంసంగ్ గాలక్సీ ఎస్ 20 FE:ఈ మొబైల్ అసలు ధర. రూ.37,990. ఈ మొబైల్ 3 కెమెరాలతో ఉంటుంది. మరియు నో కాస్ట్ EMI, vరూ.14,600 ఎక్స్ చేంజ్ ఆఫర్ కలదు.
అలాగే ఆసస్,రోగ్ ఫోన్ 5 మొబైల్ పై కూడా 10% డిస్కౌంట్ తో అందించనుంది. (సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై)


మరింత సమాచారం తెలుసుకోండి: