కోర్టానా.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దిగ్గజ టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన వర్చువల్ అసిస్టెంట్ అయిన కోర్టానా రిమైండర్‌లను సెట్ చేయడం, మైక్రోసాఫ్ట్ వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటి పనులను చేయడానికి బింగ్ సెర్చ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. సిరి, అమెజాన్ అలెక్సా వంటి వర్చువల్ అసిస్టెంట్స్ తో పోలిస్తే కోర్టానా చాలా బెటర్ అని కొందరు అభిప్రాయపడుతుంటారు కానీ మరికొందరు మాత్రం దీని పనితీరు పై అసహనం వ్యక్తం చేస్తారు. అయితే తాజాగా ఒక ప్రముఖ న్యూస్ మీడియా సీనియర్ ఎడిటర్ కోర్టానా ఎంత ఖచ్చితంగా సమాధానాలు ఇస్తుందో ఒక ప్రశ్న అడిగి పరీక్షించారు.



హే కోర్టానా, విండోస్ 11 నిజమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా.. "విండోస్ 11 అనేది ఉండదు. కొత్త వర్షన్ కి బదులుగా మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 10 వెర్షన్ కే ప్రతి ఏడాది రెండు సార్లు అప్ డేట్స్ ఇస్తుంది," అని సమాధానం ఇచ్చింది. కానీ ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 11 వర్షన్ డెవలప్ చేసిందని.. కొంతమంది ఇప్పటికే విండోస్ 11 లీక్ అయిన వర్షన్ ని వినియోగిస్తున్నారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తమాషా ఏంటంటే.. ప్రశ్న అడిగిన ఎడిటర్ యొక్క డివైస్ కూడా విండోస్ 11 పైనే వర్క్ అవుతుంది. కానీ కోర్టానా ఆ విషయాన్ని కనిపెట్ట లేకపోయింది. దీంతో కోర్టానా ఇంకా అప్డేట్ కాలేదని న్యూయార్క్ ఎడిటర్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో అప్లోడ్ చేసి వెల్లడించారు. 


ఇకపోతే విండోస్ 11 వర్షన్ గురించి అందరూ ఆసక్తికర విషయాలు నెట్టింట పంచుకుంటున్నారు. విండోస్ 11 వర్షన్ లో టాస్క్‌బార్ లో యాప్ గ్రూప్ ఉందని.. కొత్తగా యాప్ గ్రూప్స్ కూడా తయారు చేయవచ్చని నెటిజన్లు కొత్త ఫీచర్స్ గురించి అప్డేట్స్ ఇస్తున్నారు. జూన్ 24వ తేదీన అధికారికంగా విండోస్ కొత్త అప్డేట్ ని రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: