సాధారణంగా ఐ ఫోన్ లో ఏదైనా విషయాన్ని శీఘ్రంగా కనుగొనాలి అంటే అందుకు సిరి ని ఉపయోగిస్తారు. అయితే ఈ సిరి వాయిస్ ఎవరు ఇస్తున్నారు అనేది చాలామందికి తెలియక, ఈ వాయిస్ ఎవరిదో కనుగొనాలని ఆసక్తి కూడా చాలా మంది మదిలో రేకెత్తుతోంది. ఇక సిరి వెనుక ఉన్న వాయిస్ ఎవరిదో కాదు ఆమె "సుసాన్ ఆలిస్ బెన్నెట్". ఈమె 2011వ సంవత్సరంలో అక్టోబర్ 4వ తేదీన ఐఫోన్ 4S లో సిరి అని ఒక సేవను ప్రవేశపెట్టినప్పటి నుండి ఆమె ఆపిల్ యొక్క సిరి వాయిస్ ను మనకు అందించడం జరుగుతోంది. ఇక అంతేకాకుండా ఈమె మహిళా అమెరికన్ వాయిస్ గా కూడా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ios7 ను రూపొందించినప్పుడు 2013 సెప్టెంబర్ 18వ తేదీన విడుదలయ్యే వరకూ బెన్నెట్ వాయిస్ ను సిరి గా ఉపయోగించడం గమనార్హం. అయితే ఐ ఫోన్లో ఈ సిరి వాయిస్ ద్వారా మనం ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

1.ఏదైనా ట్వీట్ కోసం వెతకడం:
మీరు ఎవరిదైనా ట్వీట్ వెతకాలనుకున్నప్పుడు  సిరిని అడిగితే చాలు.. మీకు కావలసిన సంబంధిత ట్విట్టర్ లోని వినియోగదారుల నుండి ట్వీట్ల జాబితాను  మీకు వెంటనే చేరవేస్తుంది. ఇక మీకు సమయం , శ్రమ రెండూ తగ్గుతాయి.
2. తప్పులను సరిదిద్దుతుంది:
మీరు ఏదైనా పెద్ద పెద్ద వాక్యాలను ఇతరులకు పంపేటప్పుడు, ఒక్కోసారి తప్పుగా పదాలు ఉంటే వాటిని మార్చండి అని సిరికి చెప్పండి  వెంటనే తప్పులను సరి చేసి సరైన సందేశాన్ని మీకు తిరిగి పంపుతుంది. మీరు పదాలు తప్పుగా ఎంటర్ చేసినా కూడా సిరి వాటిని సమర్థవంతంగా, అర్థవంతంగా రూపొందిస్తుంది.
3. గణిత ప్రశ్నలకు సులభంగా సమాధానం ఇస్తుంది:
మీరు ఏదైనా ఒక చిక్కు ప్రశ్నను సిరిని అడిగితే , వెంటనే ఆ  గణిత ప్రశ్నలను సులభంగా, ప్రభావవంతంగా మీకు అర్థం అయ్యేలాగా వివరిస్తుంది. మీరు ఏ సమయంలోనైనా సరే లెక్కించడంలో సహాయపడడానికి సిరి చక్కగా పనిచేస్తుంది. కూడికలు ,తీసివేతలు, భాగాహారాలు ,గుణింతాలు వంటివి చేయడంలో సిరిని మించిన మరొక సేవ లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.4.నేరుగా వాయిస్ ద్వారా ట్విట్టర్ లేదా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టవచ్చు:
మీరు ట్విట్టర్ ద్వారా లేదా ఫేస్ బుక్  ద్వారా సందేశాలు పంపాలి అనుకుంటే , వెంటనే సిరిని అడగండి. సిరి మీ సందేశాలను సంబంధిత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
5.మంచి రిమైండర్ గా పనిచేస్తుంది:
మీరు ఏదైనా ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోలేను అనుకున్నప్పుడు, వెంటనే మీరు ఏ తేదీని అయితే ముఖ్య తేదీలుగా పరిగణిస్తారో, వాటిని సిరి కి చెప్పండి. సిరి భద్రంగా దాచి ఉంచి, నిర్దిష్ట సమయం వచ్చినప్పుడు మీకు ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుపుతుంది.

6.కొలతలను మార్చుతుంది:
సిరి యొక్క గణిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా, ఒక సమర్థవంతమైన యూనిట్ కన్వర్టర్ గా కూడా పని చేస్తుంది మీరు ఏదైనా ఒక యూనిట్ మొత్తాన్ని కన్వర్ట్ చేయాలని సిరి ని అడగండి. దానికి సంబంధించిన సమాధానాన్ని మీకు అందిస్తుంది. ఇక ఈ సమాచారాన్ని అందించడమే కాకుండా చిన్న జాబితాను కూడా మీకు అందిస్తుంది.

7.సంబంధాలను గుర్తిస్తుంది:
ఇటీవల కాలంలో రిలేషన్షిప్ కు చాలా తక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఎవరు ఎవరికి ఏమవుతారు? ఎవరు ఎవరిని ఏమని పిలవాలో ?కూడా తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మీరు ఎలాంటి అభ్యంతరం లేకుండా సంబంధ బాంధవ్యాల గురించి అడిగినప్పుడు  మీకు  చక్కటి సమాధానం ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: