గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు ఆకాశం వైపు తలెత్తి వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. తొలకరి చినుకులు పడగానే దుక్కి దున్ని విత్తనాలు విత్తుకొని వర్షపు చుక్క కోసం ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూసే కర్షకులకు కడుపు నింపే కబురు అని చెప్పవచ్చు. తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం
మరోవైపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. శనివారం అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఉప్పరగూడెంలో 14 సెంటీమీటర్లు, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 8, రామగుండం 7 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా నర్సాపూర్‌లో 5.93 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెంలో 5.83సెంటి మీటర్ల, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంటలో 5.20 సెంటీమీటర్లు వర్షం కురిసినట్టు వాతావరణశాఖ అధికారులు తెలియజేశారు. ఈ తీపి కబురు కోసం రైతన్న గత కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్నారు.