కెమెరా అనే పదం ‘కెమెరా అబ్స్కురా’ లాటిన్ పదం నుంచి పుట్టుకొచ్చింది. లాటిన్‌లో దీనికి అర్థం డార్క్ చాంబర్. ఫోటోలను కెమెరాలో బంధించాలనే కాన్సెప్ట్ మొదటిసారిగా చైనాకు చెందిన తత్వవేత్త మోజీ కనుగొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న చిన్న కెమెరాలోని స్కీనింగ్ హోల్ ద్వారా బాహ్య ఆవరణలోని చిత్రాలను తీసుకునే విధంగా ఉపయోగపడుతుంది. వ్యతిరేక ఉపరితలంపై విలోమ చిత్రాలను తీసుకునేందుకు కెమెరాలను అభివృద్ధి చేశారు.

1816లో సేమి, నికోఫోర్ నిప్సే ఇద్దరు మొట్టమొదటి ఛాయాచిత్రాన్ని చిత్రీకరించారు. సేమి తయారు చేసిన కెమెరాలో సిల్వర్ క్లోరైడ్‌తో తయారు చేసిన కాగితపు ముక్కను ఉపయోగించి ఫోటో తీశారు. కానీ, మనుషులకు తెలిసిన పురాతన ఛాయా చిత్రం 1838 నాటికి చెందింది. ఈ ఫోటోను పారిస్‌లో తీశారు. ఇది బ్లాక్ అండ్ ఫోటో. దీని తర్వాత కలర్ ఫోటో 1861లో మొట్ట మొదటిసారిగా తీశారు. మొదటి కలర్ ఫోటోను జేమ్స్ క్లార్క్ మాక్స్‌వెల్ తయారు చేశాడు.

అప్పట్లో ఫోటోగ్రాఫీ, ఫిల్మ్‌పై ఆదరణ ఎక్కువగా ఉండేది. ప్రజలు కూడా తమ ఫోటోలు తీసుకోవడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేవారు. అయితే గతంలో మనకు తెలిసిన కెమెరాలు చూస్తే ఒక వ్యక్తి కెమెరాపై నల్లని బట్టను కప్పుకుని ఫోటోలు తీసేవారు. రాను రాను వీటికి ఆదరణ పెరగడంతో 1888లో జార్జ్ ఈస్ట్‌మన్ కెమెరాలో కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చారు. కోడాక్ సంస్థను ప్రారంభించి వాటికి అమ్మకాలు చేయడం ప్రారంభించారు. 1976 సంవత్సరంలో కోడాక్ యునైటెడ్ స్టేట్స్‌లో 90 శాతం ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ మార్కెట్ వాటాను కలిగి ఉంది.

ఫోటోగ్రఫీలో ముఖ్యమైనది ఎస్ఎల్ఆర్ (సింగిల్ లెన్స్ రిప్లెక్స్). ఇది కెమెరా యొక్క అద్భుతమైన ఆవిష్కరణ. 1933లో 127 రోల్‌ఫిల్మ్‌లను ఉపయోగించిన కాంపాక్ట్ ఎస్ఎల్ఆర్ ఇహాగీ ఎక్సాక్తా విడుదలైంది. ఆ తర్వాత డిజిటల్ కెమెరాలు వాడుకలోకి వచ్చాయి. 1975లో కోడాక్ తన కెమెరాలను డిజిటలైజేషన్ చేసింది. ఈ కెమెరా బరువు 8 పౌండ్లు, 0.01ఎంపీ రిజల్యూషన్, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను రికార్డు చేయగలదు. ఆ తర్వాత కోడాక్, కెనాన్‌తో జతకట్టి మొట్టమొదటి డీఎస్ఎల్‌ఆర్ కెమెరాను విడుదల చేసింది. ఇది కోడాక్, కెనాన్ ఎఫ్-1 ఫిల్మ్. డీఎస్ఎల్ఆర్ బాడీ అభివృద్ధి చేసిన 1.3 ఎంపీ ఇమేజ్ సెన్సార్ ఉపయోగించారు. 1990-2000లో అనేక కెమెరా తయారీదారులు డీఎస్ఎల్ఆర్ మార్కెట్‌లోకి అడుగు పెట్టారు. వీటిలో కెనాన్, ఫుజీ, పెంటాక్స్, ఒలింపస్, పానాసోనిక్, సోనీ, సిగ్మా తదితర సంస్థలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: