సాధారణంగా ట్రాక్టర్ టైర్ లు పెద్ద పెద్దగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే..? ట్రాక్టర్ టైర్ లలో నీరు పోస్తారు అన్న విషయం.. కొంతమందికి ట్రాక్టర్ టైర్ లలో నీరు పోస్తారన్న విషయమే తెలియదు.మరి కొంతమందికి ట్రాక్టర్ టైర్ లలో నీళ్లు ఎందుకు పోస్తారు..? అనే సందేహం కలగవచ్చు. ఒకవేళ టైర్లలో గాలి తో పాటు నీటిని కూడా పోయడం వల్ల ఏం జరుగుతుంది..? ఎంత మొత్తంలో నీళ్లు పోయాలి ..? ఇలా నీళ్లు పోయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది..? అనే ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటారు.. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఏమిటో..? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..టైర్ తిరిగేటప్పుడు జారి పోకుండా ఉండడానికి టైర్లలో నీరుని పోయడం అందరికీ తెలిసిన మాటే. కేవలం గాలితో నింపిన టైర్లను ఉపయోగించడం వల్ల పొలాలలో దుక్కి దున్నేటప్పుడు ఆ బరువుని టైర్లు తట్టుకోలేవు. ఫలితంగా  ఎక్కువ కాలం మన్నిక కూడా రావు.. కాబట్టి టైర్లలో నీటిని నింపడం వల్ల టైర్ తిరిగేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎక్కువ కాలం మన్నిక  వచ్చేలా ఉపయోగపడతాయి. ట్రాక్టర్ టైర్ లలో ఈ నీటిని నింపడం వల్ల ఎటువంటి రోడ్ల లో నైనా సరే సజావుగా వెళ్లడానికి వీలుగా ఉంటుంది.అయితే ఈ టైర్ ట్యూబ్ లో ఎంత మోతాదులో నీటిని నింపాలి అంటే లోపల ట్యూబ్ లో 75 శాతం వరకు కచ్చితంగా నీటిని నింపాలి. మిగిలిన 25 శాతం మాత్రమే గాలిని నింపితే సరిపోతుంది. ట్రాక్టర్ ఎలాంటి రోడ్ లలో  అయినా సరే సజావుగా వెళ్ళాలి అంటే ముందుగా ట్రాక్టర్  స్థిరత్వాన్ని పొందాలి. అలా ఉండాలి అంటే వాటిలో నీటి నింపడం వల్ల ట్రాక్టర్ స్థిరత్వానికి అనువుగా టైర్లు చలనం పొందుతాయి. ట్రాక్టర్ బరువు పెరుగుతుంది. అప్పుడు మంచి పట్టు కూడా అందుతుంది.కొన్ని దేశాలలో అయితే టైర్ ట్యూబ్ లలో నీటికి బదులు క్యాల్షియం క్లోరైడ్ ద్రావణాన్ని నింపుతారు. శీతల దేశాలలో నీరు గడ్డ కడుతుంది.. కాబట్టి నీటిని నింపడం చాలా కష్టంతో కూడుకున్న పని.కాబట్టి క్యాల్షియం క్లోరైడ్ ద్రావణాన్ని నింపడం వల్ల ట్రాక్టర్ బరువు పెరుగుతుంది. శీతల దేశాలలో నీటి కన్నా క్లోరైడ్ ద్రావణం ఉపయోగించడానికి గల కారణం ఏమిటంటే, క్యాల్షియం క్లోరైడ్ ద్రావణం అంత త్వరగా గడ్డకట్టదు.. అంతే కాకుండా నీటి కన్నా 30 శాతం అధిక బరువును కలిగి ఉంటుంది. ఇక ఈ క్యాల్షియం క్లోరైడ్ ద్రావణం ట్యూబ్ ని కానీ టైర్ ని గానీ నలగకుండా చేయడానికి చక్కగా పనిచేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: