మనం నిద్ర లేవడంతోనే ముందుగా చేసే పని స్మార్ట్ ఫోన్ లో ఆప్డేట్స్ చూసుకోవడం.. ఫ్రెండ్స్ మెసేజెస్ కు రిప్లై ఇవ్వటం..అలాగే యాప్స్ నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకు ఇలా అనేక రకాల పనులు స్మార్ట్ ఫోన్ ద్వారానే చేస్తుంటాం. అలాగే రక రకాల యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం.కానీ, మీరు వాడే యాప్స్ మీ వ్యక్తిగత సమాచారాన్ని ఖచ్చితంగా లాగేస్తాయి.తాజాగా  వెళ్ళడయిందేంటంటే 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఫేస్‌బుక్ యూజర్ల డేటాను దొంగలించినట్లు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తయారీ సంస్థ డాక్టర్ వెబ్ వెల్లడించడం జరిగింది. వీటిలో తొమ్మిది యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ కోసం అందుబాటులో ఉన్నాయట. వాటి గురించి తెలిసిన తర్వాత ఆ యాప్స్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు డాక్టర్ వెబ్ తెలిపడం జరిగింది.అలాగే ఇంకా డౌన్లోడ్ చేసుకొని ఉన్నట్లయితే తక్షణమే అన్ ఇన్స్టాల్ చెయ్యాలని సూచించింది.

ఇక ఈ మొబైల్ యాప్స్ ని చాలా వరకు 1,00,000 మందికి పైగా ఇన్స్టాల్ చేసుకొని వున్నారు. మరొక దాన్ని 5 మిలియన్ మంది యూజర్లు ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది.ఇక డాక్టర్ వెబ్ నివేదిక ద్వారా తెలిసిందేంటంటే..ఫోటో ఎడిటింగ్ యాప్స్, పీఐపీ ఫోటో యాప్స్ ను 5 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారట. అలాగే ఈ జాబితాలలో App Lock Keep, App Lock Manager, Lockit master వంటి యాప్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇంకా ఈ జాబితాలలో మెమొరీ క్లీనర్, ఫిట్ నెస్ యాప్, రెండు హొరోస్కోప్ వంటి యాప్స్ కూడా ఉన్నాయి. వీటిని చాలా సార్లు కూడా చాలా మంది ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. Rubbish Cleaner, Inkwell Fitness, Horoscope Daily, HscopeDaily అనే యాప్స్ ని 1,00,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్స్ కనుక మొబైల్ లో ఉన్నట్లయితే తక్షణమే అన్ ఇన్స్టాల్ చేయవలసిందిగా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ యాప్స్ ని తక్షణమే మీ మొబైల్ నుంచి డిలేట్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: