టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)..ఆ సంస్థ యొక్క మై స్పీడ్ అప్లికేషన్ సహాయంతో భారతదేశమంతటా ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థలు తమ కస్టమర్లకు అందిస్తున్న నెట్వర్క్ వేగాన్ని లెక్కించింది. ఈ నివేదిక ప్రకారం నెట్వర్క్ దిగ్గజ సంస్థలు అయిన రిలయన్స్ జియో అలాగే వోడాఫోన్, ఐడియా ల మధ్య నెట్వర్క్ వేగాన్ని పరీక్షించింది. ఇక ఈ పరీక్షలో తేలిన విషయం ఏమిటంటే, గత నెల.. జూన్ నెలలో జియో సెకన్ కు 21.9 mbps వేగంతో దేనినైనా డౌన్లోడ్ చేసుకునే విధంగా 4జీ నెట్వర్క్ ను పొందే సదుపాయాన్ని కల్పించింది. ముఖ్యంగా జూన్ లో వెలువడిన డౌన్లోడ్ వేగం విషయానికి వస్తే, ఫోర్ జీ నెట్వర్క్ సర్వీస్ అందిస్తున్న ప్రముఖ దిగ్గజ టెలికామ్ సంస్థలలో రిలయన్స్ జియో చాలా వేగంగా ఉందని TRAI తెలిపింది.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, జియో తన 4g నెట్వర్క్ వేగాన్ని తన ప్రత్యర్థి అయిన వోడాఫోన్ అలాగే ఐడియా వంటి దిగ్గజ టెలికాం సంస్థల కంటే మూడు రెట్లు అధికంగా, వేగంగా 4జీ నెట్వర్క్ ను అందిస్తోందని వెల్లడయింది. అలాగే ముందు నెలలతో పోలిస్తే, జియో ఇంటర్నెట్ వేగం కూడా స్వల్పంగా పెరిగిందని చెప్పవచ్చు. జియో సెకన్ కు 21.9 mbps వేగముతో నెట్వర్క్ డేటాను అందించగా, వోడాఫోన్ అలాగే ఐడియా 6.2mbps డేటా వేగంతో అప్లోడ్ విభాగంలో ముందంజలో ఉన్నాయని తాజాగా వెలువడిన డేటా ప్రకారం TRAI తెలిపింది.
ఇక ఇటీవల TRAI తెలిపిన వివరాల మేరకు ఎయిర్టెల్ సగటు 4g డౌన్లోడ్ వేగం 5mbps వద్ద కనిష్ఠ స్థాయిలో నిలిచింది. ఇక వోడాఫోన్ అలాగే ఐడియా నెట్వర్క్ దిగ్గజాలు మే నెలలో సగటున సెకండ్ కి 6.2 mbps అప్లోడ్ వేగాన్ని కలిగి ఉండగా, దాని తర్వాత రిలయన్స్ జియో 4.8 mbps వేగంతో నిలిచింది. ఇక ఎయిర్టెల్ 3.98 mbps వేగంతో నెట్వర్క్ ను అందించింది. ప్రభుత్వ యాజమాన్యంలో గుర్తింపు పొందిన బిఎస్ఎన్ఎల్ ను ముఖ్యంగా ఎంచుకున్న ప్రాంతాలలో 4జి సేవలను కూడా ప్రారంభించడం మొదలుపెట్టింది. అయినా ట్రాయ్ నివేదిక ప్రకారం అనుకున్న స్థాయిలో నెట్వర్క్ వేగాన్ని అందించలేక పోతుంది BSNL.
ఇక మే నెలలో వెనుకబడిన రిలయన్స్ జియో జూన్ నెలలో ఊహించని విధంగా నెట్వర్క్ ను వేగంగా అందించడంలో ముందజలో వుంది. ఇక తమ కస్టమర్ల కోసం ఏకంగా సెకనుకు 21.9 mbps వేగం కలిగిన ఫోర్ జీ నెట్వర్క్ ను అందిస్తోంది.