ప్రస్తుత టెక్ యుగంలో ప్రతి ఒక్కరూ వాట్సాప్ ను వినియోగించడం సర్వసాధారణమయింది. ప్రతి ఒక్కరూ తెలిసినా, తెలియకపోయినా గానీ వాట్సాప్ ను యూజ్ చేస్తున్నారు. 10 సంవత్సరాల వాళ్ల నుంచి పండు ముసలివాళ్ల వరకు వాట్సాప్ వాడకం విరివిగా పెరిగిపోయింది. అంతలా వాట్సాప్ అనేది మన నిత్య జీవితంలో భాగం గా మారిపోయింది. వాట్సాప్ ను ఫోన్ లో వాడడంతో పాటు డెస్క్ టాప్ లోనూ వాడుతూ ఉంటాం. ఇలా వాట్సాప్ ను డెస్క్ టాప్ లో వాడుతూ ఉన్నపుడు వచ్చిన ప్రతి మెస్సేజ్ కోసం వాట్సాప్ కు వెళ్లి చూడకుండా కొన్ని ముఖ్యమైన షార్ట్ కట్స్ ఉన్నాయి.


మనం వాట్సాప్ లో తరుచుగా బ్లూ టిక్స్ చూస్తూ ఉంటాం. మనం ఎవరికైనా మెస్సేజ్ పంపితే వారు ఆ మెస్సేజ్ ని ఓపెన్ చేసి చదవడం వల్ల ఇలా బ్లూ టిక్స్ వస్తాయి. కానీ ఇలా బ్లూ టిక్స్ రాకుండా ఉండేదుంకు control+alt+shift+u ని వాడితే సరిపోతుంది. మనం మన గ్రూపుల్లో ఉన్న ఏదైనా మెస్సేజుని వెతకాలనుకుంటే సులభంగా control+alt+shift+f షార్ట్ కట్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. మనం కావాలనుకున్న మెస్సేజును సెర్చ్ చేసుకునే వీలుంటుంది. ఏవైనా ముఖ్యమైన వాట్సాప్ గ్రూపులను ముందు కనిపించేలా పిన్ చేసేందుకు కూడా ఓ షార్ట్ కట్ అందుబాటులో ఉంది. ఇందుకోసం control+alt+shift+p వాడి సులభంగా పిన్ చేసుకోవచ్చు. మనకు కొన్ని సందర్భాల్లో కొన్ని వాట్సాప్ గ్రూపులలో జరిగే సంభాషణలు చిరాకు తెప్పిస్తుంటాయి. వాటి నుంచి మనం త్వరగా బయట పడేందుకు చూస్తూ ఉంటాం. ఇలా గ్రూపు నుంచి బయటకు వచ్చేందుకు control+alt+Backspace క్లిక్ చేస్తే సరిపోతుంది. మనం కొన్ని కొన్ని సార్లు మ్యాటర్ మొత్తం టైప్ చేసేందుకు ఓపిక లేక వాయిస్ మెస్సేజ్ పెడుతుంటాం. ఈ మెస్సేజ్ స్పీడ్ ను మనం సెట్ చేసుకునేందుకు కూడా షార్ట్ కట్ అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: