చమురు దిగుమతులే మన కొంప ముంచుతున్నాయి అని ఆర్థికవేత్తలతో సహా ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. విపరీతంగా పెంచుతూ పోతున్నా చమురు ధరల కారణంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతున్నాయి. అంతేకాకుండా  రూపాయి మారక విలువ  దిగజారిపో తుందని అంటున్నారు. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్  ద్వయం తెచ్చిన ఐ.ఎం.ఎఫ్ ప్రపంచ బ్యాంక్ ఆ దేశిత ఆర్థిక విధానాలనే వాజ్ పేయి ప్రభుత్వం చేసింది. అలాగే మన్మోహన్ సింగ్ సర్కార్ బాటలోనే  మోడీ ప్రభుత్వం నడుస్తోంది. కాబట్టి ఆ పార్టీలు పరస్పరం విమర్శించుకోవడం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప నిజంగా మాత్రం కాదు. ఇకపోతే దేశంగా పెట్రో గ్యాస్ ధర పెంపు వల్ల రవాణా రంగంపై  తీవ్ర ప్రభావం చూపనుంది. కరోణ సంక్షోభం లోనూ  ధరల పెరుగుదలతో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి.

దేశీయ మార్కెట్లో పెట్రో ఉత్పత్తులు రేట్లు మరింత హెచ్చు, నిత్యావసర వినియోగ వస్తువుల ఖరీదు కాక తప్పదు. ద్రవ్యోల్బణం అదుపు తప్పితే మరిన్ని కష్టాలు తప్పవు. బ్యాంకు వడ్డీ రేట్లు పెరగడం రుణాల మీద ప్రభావం వంటి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. రూపాయి పతనం అవుతున్నందున పెట్టుబడిదారులు డాలర్ సురక్షితమైనదిగా భావించి  విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా తరిగిపోతున్నాయి. రూపాయి విలువ తగ్గుదలతో ఎగుమతులకు మేలు జరగవచ్చని  అంటున్నారు. అయితే ఇప్పటికే అమెరికా ఐరోపా మార్కెట్లలో  విధించిన నిబంధనల వల్ల  వాటికి ముప్పు ఏర్పడిన వాస్తవాన్ని విస్మరించరాదు . అంతేగాక దిగుమతుల భారం వల్ల ఆర్థిక వ్యవస్థకు  కలిగే నష్టాన్ని గుర్తించాలి.

 దాదాపు మన దేశం నుంచి తరలిపోకుండా పరిమితం చేయడానికి విలాస  వస్తువుల విచ్చలవిడి దిగుమతులపై ఆంక్షలు విధించడం అవసరం అన్న భావన ఉంది. దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ఆర్థిక విధానాల వైపు ఇప్పటికైనా మల్లాల్సి ఉంది. రూపాయి పతనం ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల ధరలు పెరిగిపోతాయి. ప్రపంచీకరణ విధానాలు వచ్చాక ద్రవ్య మారక రేట్లతో ప్రజా జీవనం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన చమురు దొరలకు నిర్ణయాత్మకం అవుతుంది. రూపాయి మారకం విలువ పడిపోతుందని  2014 ఎన్నికలకు ముందు మోడీ కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. అయితే రూపాయికి శస్త్ర చికిత్స చేయకుండా  దీనిని సాధించడం అసాధ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: