ప్రస్తుతం మన ఐడెంటిఫికేషన్ కింద ఉండేటువంటి కొన్ని డాక్యుమెంట్లలో పాన్ కార్డు కూడా ఒకటి. ఈ పాన్ కార్డ్ ద్వారా బ్యాంకు కు సంబంధించిన వివరాలను మొత్తం అందులో చేర్చబడతాయి. ప్రస్తుతం పాన్ కార్డు చేతికి రావాలంటే దాదాపుగా రెండు మాసాల పాటు పడుతుంది. కానీ ఈ పాన్ కార్డు కావాలంటే కేవలం 5 నిమిషాలు చాలు. పాన్ కార్డు కు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇది మన చేతికి లభిస్తుంది. అయితే ఆన్లైన్లో కొత్త కార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం.

1). మనం ముందుగా..www.incometax.gov.in గూగుల్ సెర్చ్ లో ఓపెన్ చేయాలి.

2). ఓపెన్ చేసిన తర్వాత అందులో ఇన్స్టంట్  పాన్ కార్డు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అలా ఎంచుకున్న తర్వాత ఎడమవైపున QUICK LINKS అనే ఆప్షన్ ని కనిపిస్తుంది. అందులో INSTANT PAN THROUGH AADHAAR అనే వాటి పైన క్లిక్ చేయాలి.

3). ఆ తర్వాత అక్కడ ఒక న్యూ పేజి పైన క్లిక్ చేయాలి. మన ఆధార్ కార్డ్ నెంబరు అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది.

4). అక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత.. తిరిగి మీ ఆధార్ యొక్క వివరాలను ఒకసారి సరి చూసుకోవాలి. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి.

4). అలా చేసిన తర్వాత మనకు ఒక 15 అంకెల అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఇదంతా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పాన్ కార్డు జారీ అవుతుంది.,

5).CHECK STATUS లేదా DOWNLOAD PAN వీటిపై ఎంటర్ చేసి, మీ ఈ-పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ చేసిన పాన్ కార్డు  పిడిఎఫ్ రూపంలో మీ మెయిల్ కి వస్తుంది. ఈ ఈ- పాన్ కార్డ్ కూడా ఒరిజినల్  కార్డు లాగానే పనిచేస్తుంది. ఈ పాన్ కార్డు ని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు .

మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పాన్ కార్డు కావాల్సి వస్తే ఇలా చేయండి..


మరింత సమాచారం తెలుసుకోండి: