ఎంతో ప్రజాదారణ పొందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య చూస్తే దాదాపు 200 కోట్ల మార్క్ ను అధిగమించిందనే చెప్పాలి. అలాగే ప్రపంచ జనాభాలో ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఈ వాట్సాప్ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సప్ ఇప్పుడు అందరికి షాక్ ఇచ్చేలా ఒక నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే  2021 జూన్ – జులై నెలల్లో వాట్సాప్ ను వినియోగించే 3 మిలియన్ల మంది ఖాతాలను నిలిపివేసినట్లు వాట్సాప్ సంస్థ తెలిపింది.  ప్రజలకు సురక్షితమైన సమాచారాన్ని అందించడం కోసం కొంతమంది ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ పేర్కొంది.

కొంతమంది వాట్సాప్ యాప్ యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు కారణంగా , ఇండియా గ్రీవియెన్స్ ఆఫీసర్ నుంచి అందిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వీరి ఖాతాలను ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా  నిషేదించడం జరిగింది. కొత్త ఐటీ చట్టం 2021 వ సంవత్సరంకు అనుగుణంగా కొత్త ఐటీ చట్టం ప్రకారం వాట్సాప్ సంస్థ  తన యూజర్ల సేఫ్టీ మంత్లీ రిపోర్ట్ ను బయటకు విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం జూన్ 16 నుంచి జులై 31 తేదీ వరకు అంటే కేవలం 46 రోజుల వ్యవధిలోనే కొంతమంది యూజర్ల నుంచి కొన్ని  ఫిర్యాదులు వచ్చాయి.యూజర్లు ఇచ్చిన ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని వాట్సాప్ తన స్వంత టూల్స్ గుర్తించిన స్పామ్ గల 3.027 మిలియన్ ఖాతాలను గుర్తించి ఇప్పుడు వాటిని  నిషేధించినట్లు వాట్సాప్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.


అంటే వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం దాదాపు 3.027 మిలియన్ల ఖాతాలను నిలిపి వేసినట్లు తెలుస్తుంది. అనుమానస్పద  సందేశాలతో పాటు ఫేక్ న్యూస్ లను కూడా వ్యాప్తి చేస్తున్న ఈ ఖాతాలను  గుర్తించేందుకు గాను వాట్సాప్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.ఒకవేళ యూజర్లు మళ్ళీ వాట్సాప్ ప్రతినిధులను  సంప్రదించాలంటే wa@support.whatsapp.comకు ఈ-మెయిల్ చేయవచ్చు అని వాట్సాప్ తన యూజర్లకు తెలిపింది.ఒకవేళ మీ వాట్సాప్ ఖాతా కనుక బ్లాక్ అయితే పైన తెలిపిన మెయిల్ అడ్రెస్ కి మెయిల్ చేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: