ప్రముఖ దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ వన్ ప్లస్ తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. అందులోనూ అత్యధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను కేవలం రూ.20 వేల లోపే తమ కస్టమర్లకు అందించడానికి ముందుకు వచ్చింది. అయితే వన్ ప్లస్ అందిస్తున్న స్మార్ట్ ఫోన్ మోడల్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఇటీవల వన్ ప్లస్ 30 వేల రూపాయల రేంజ్లో స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసినప్పటికీ , వీటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకే భారత దేశం లో బడ్జెట్ ధరలకే స్మార్ట్ ఫోన్లు ను ఇవ్వాలని నిశ్చయించుకుంది వన్ ప్లస్.. ఇక ఈ ఆలోచనతో ఇప్పటికే సాంసంగ్ , వివో , షియోమీ, ఒప్పో సంస్థలు క్యాష్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. వీటన్నింటినీ తలదన్నేలా బడ్జెట్ ధరలోనే త్వరలోనే స్మార్ట్ ఫోన్ లను తమ కస్టమర్లకు అందించాలని వన్ ప్లస్ ఆలోచన చేస్తోంది . ఈ మేరకు వచ్చే ఏడాది రూ. 20 వేల రూపాయలలోపే స్మార్ట్ ఫోన్ లు విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇక ఇందులో భాగంగానే వన్ ప్లస్ ప్రవేశపెట్టిన ఆక్సిజన్ ఓ ఎస్ మోడల్, ఒప్పో కలర్ వోఎస్ తో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.. వచ్చే ఏడాది ఈ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసి, భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను వన్ ప్లస్ శాసించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ విడుదల లేట్ అయినప్పటికీ తప్పకుండా మార్కెట్ ను శాసిస్తాము అని వన్ ప్లస్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వన్ ప్లస్ ఫ్లాట్ షిప్, ప్రీమియం ఫోన్లతో మార్కెట్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. వచ్చే ఏడాది బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను కూడా కస్టమర్లకు పరిచయం చేయాలని చూస్తోంది. అందుకే 20 వేల రూపాయల ధరలోనే బడ్జెట్ ఫోన్లను నార్డ్ బ్రాండింగ్ తో చేయడానికి సిద్ధమవుతోంది.. ఇప్పటికే వన్ ప్లస్ నార్డ్ ఎన్ 200 5 g వంటి ఫోన్ లను సరసమైన ధరలకే అమెరికా, కెనడా వంటి మార్కెట్లో విడుదల చేసింది..ఇక వచ్చే ఏడాది రూ. 20 వేల లోపే స్మార్ట్ ఫోన్ లను తీసుకొస్తామని ప్రకటించింది వన్ ప్లస్.