తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఐటీ, ఫార్మా,  వస్త్ర తయారీ పరిశ్రమ రంగాలు  ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఇటీవలే భారత దేశ అత్యున్నత వ్యవస్థ నీతి అయోగ్ ఈ మేరకు ప్రశంసించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2019 -2020 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రపంచ దేశాలు,  భారత దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై ప్రచురించిన ఓ నివేదికలో భారతదేశ అత్యున్నత ప్రణాళికా సంస్థ ఈ మేరకు చర్చించింది. ఈ క్రమంలోనే ప్రతిరంగంలోనూ సరికొత్త పాలసీలు ప్రవేశపెడుతూ ఈ దిశగా రాష్టం  దూసుకుపోతుందని పలువురు ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. జీఎస్టీ పరంగా దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏడో అతిపెద్ద రాష్ట్రంగా అవతరించడం తో పాటు భవిష్యత్తులో మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రంలో ఐటీ రంగం స్థిరమైన వృద్ధి రేటు కనబడుతోందని నీతిఅయోగ్ అర్ద్ నీతితో పాటు ఇతర సంస్థల నివేదికలు ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లలో రాష్ట్రంలో ఐటీ సేవల రంగం స్థిరమైన వృద్ధి సాధించిందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా అగ్రగాములుగా ఉన్నా ఐటీ కంపెనీలయినా గూగుల్,  ఫేస్ బుక్, ఐబీఎం తదితర కంపెనీలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి కార్యాలయాలు ప్రారంభించాయని తెలిపింది.

 రానున్న ఐదు సంవత్సరాల్లో హైదరాబాదులో ఐటి రంగం 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 53 లక్షల పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తుందని అంచనా వేసింది. రాష్ట్ర జిఎస్టి లో పారిశ్రామికరంగం 17 శాతం వాటా కలిగి ఉందని, ఈ  రంగంలో హై టెక్నాలజీ, రంగాలైన ఫార్మాసుటికల్స్,  బయోటెక్నాలజీ,  నానో టెక్నాలజీలే అత్యధిక వాటా కలిగి ఉన్నాయని పేర్కొంది. సంప్రదాయ తయారీ రంగాలైన టెక్సటైల్స్, తోలు, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్ లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నాయని పేర్కొంది. ఈ విధంగా తెలంగాణలో ఉద్యోగాల కల్పనకు ఇప్పుడు తోడ్పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: