ఆపిల్ గత నెలలో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్‌లను ఆవిష్కరించింది. దీనితో పాటుగా కంపెనీ తన సరికొత్త స్మార్ట్‌ వాచ్ ఆపిల్ వాచ్ సిరీస్ 7 ని కూడా విడుదల చేసింది. దీని అమ్మకం భారతదేశంలో ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ధర వెల్లడి చేయలేదు. ఆపిల్ వాచ్ సిరీస్ 7 ఇప్పుడు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ చేశారు. దీనిలో ఈ స్మార్ట్ వాచ్ ధర చెప్పేశారు. ఫ్లిప్‌ కార్ట్‌లో లిస్ట్ చేసిన సమాచారం ప్రకారం ఈ వాచ్ ప్రారంభ ధర రూ .41,900. ఈ సంవత్సరం తరువాత అందుబాటులో ఉన్న ట్యాగ్‌తో ఇది అందులో కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ సేల్ అయ్యే తేదీ ఇంకా తెలియరాలేదు.

టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ఈ సమాచారాన్ని మైక్రోబ్లాగింగ్ సైట్లో వెల్లడించారు. ధర విషయానికొస్తే, 41 ఎంఎం అల్యూమినియం కేస్ మోడల్ ధర రూ .41900. 45 ఎంఎం కేస్‌ వేరియంట్ ధర రూ. 44,900 ఉంటుంది. 41 ఎంఎం సెల్యులార్ మోడల్ ధర రూ. 50,900 కాగా, 45 ఎంఎం వేరియంట్ ధర రూ . 53,900. అంతే కాకుండా స్టెయిన్‌ లెస్ స్టీల్ వేరియంట్‌లో జిపిఎస్, సెల్యులార్ మోడల్ ఉన్నాయి. ఇది 41 ఎంఎం కేస్ లో వస్తుంది. దీని ధర రూ. 69,900, 45 ఎంఎం మోడల్ ధర 73,900.

ఆపిల్ వాచ్ సిరీస్ 7లో చాలా మంచి సెన్సార్లు ఉన్నాయి. పాత మోడల్ లాంటి ఈ వాచ్ ఓఎస్ 8 ఇంటర్‌ఫేస్ ఉంది. దీనిలో అనేక మంచి ఫీచర్లు, అల్గోరిథంలు మెరుగు పరచబడ్డాయి. ఇది కొన్ని కొత్త వాచ్ ఫేస్‌లు, IP6x వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ని కలిగి ఉంది. బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే... పూర్తి ఛార్జ్‌ చేస్తే ఆపిల్ వాచ్‌ను సాధారణంగా 18 గంటల పాటు ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. USB C పోర్ట్ సహాయంతో దీనిని ఛార్జ్ చేయవచ్చు. కేవలం 8 నిమిషాల ఛార్జ్‌లో 8 గంటల బ్యాకప్ ఇవ్వగల సామర్థ్యం ఉందని కంపెనీ తెలిపింది. ఈ లేటెస్ట్ యాపిల్ వాచ్ ఐదు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇవి బ్లాక్, బ్లూ, గోల్డ్, రెడ్, డార్క్ గ్రే కలర్స్‌లో వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: