తక్కువ పెట్టుబడులతో స్వల్ప కాలంలో అందివచ్చే వరాల పంట అయిన పెసర రైతుకు అన్ని విధాలా కలిసివస్తుంది. సాగు ఆరంభం నుంచి  ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 4 నుండి 7 క్వింటాళ్ల  వరకు దిగుబడి పొందవచ్చు. ప్రస్తుతం రబీ పంటగా పెసరు ను సాగు చేసే రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్దతుల గురించి తెలుసుకుందాం. ఖరీఫ్ సీజన్లో మంచి వర్షపాతం నమోదైనప్పటికీ కొన్ని మండలాల్లో భూగర్భ జలాలు సాధారణ స్థాయికి చేరుకోలేవు. దీంతో రబీలో ఆరుతడి పంటలు గా అపరాల ను సాగు చేయడం ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంటల మార్పిడి లో భాగంగా వీటిని సాగు చేయడం వల్ల భూసారం కూడా పెరుగుతోందని, ఖరీఫ్లో వరి సాగుకు నోచుకోని ప్రాంతాలు తొలకరి సోయా చిక్కుడు సాగు చేసినటువంటి ప్రాంతాల్లో తక్కువ నీటితో చేతికొచ్చే అటువంటి పెసర పంట ఫైటింగ్ ఎంతో అనుకూలం. సెప్టెంబర్  22 నుంచి అక్టోబర్ 20 వరకు ఈ పంటను వేయడానికి అనువైన సమయం.

 తప్పనిసరి అయితే తప్ప  అక్టోబర్ చివరి వరకు వెళ్ళకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ నవంబర్ నెలలో  ఈ పంటను వేయరాదు. ఈ పంట వేయడానికి మన పంట పొలాన్ని ఒకటి లేదా రెండు సార్లు కల్టివేటర్ ద్వారా చదును చేయాల్సి ఉంటుంది. పూర్తిగా పూర్వ పంట అవశేషాలు అనేవి కనబడకుండా బాగా దున్నించాలి. ఈ యొక్క పెసర పంటను ఎర్ర నేలలు, మధ్యస్థం నేలలు, ఎర్ర చిలక  నెలలలో  ఎక్కువగా చదువు చేసుకోవచ్చు. చౌడు నేలలు,  మురుగు నీరు నిలిచే నేలలు ఈ యొక్క పంటకు పనికిరావు.

 యొక్క పంటను  ఒక ఎకరానికి లక్ష 33 వేల పైన మొక్కలు ఉండేలా చూసుకోవాలి.  ఈ యొక్క పంట లో విత్తనాలను వరంగల్ 42 వాడాలి. దీని యొక్క పంట కాలం  55 నుంచి 60 రోజులు వస్తుంది. ఈ యొక్క పంట ఎకరాకు దిగుబడి నాలుగు నుంచి ఆరు కింటాలు, పల్లాకు తెగులు కూడా తట్టుకుంటుంది. అలాగే ఎం జి జి 347 విత్తనాలు, ఇది కూడా పంటకాలం 65 నుంచి 70 రోజులు పడుతుంది. కొంతమేర బెట్టను తట్టుకొని, ఒకటి పల్లాకు తెగులు  కూడా తట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: