తరచుగా మనం ఫోన్ లో ఏదైనా అవసరం అనిపించిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉంటాము. స్క్రీన్ షాట్ తీసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఫోన్ కు సైడ్ లో ఉండే బటన్స్ నొక్కడం, లేదా స్క్రీన్ పై మూడు వేళ్ళతో కిందకు డ్రాగ్ చేయడం వంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు స్క్రీన్ షాట్ ను మరింత సులభంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. బటన్‌ను క్లిక్ చేయకుండానే ఐఫోన్‌లో స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే అది కూడా సాధ్యమవుతుంది. పైగా చాలా సులభం. వెబ్‌లో మీరు చూసిన వాటిని డాక్యుమెంట్ చేయడానికి లేదా యాప్ యాక్టివిటీ కోసం, వినోదం కోసం స్క్రీన్‌షాట్‌లు తీసుకోవడానికి సులభమైన మార్గాలలో ఇది ఒకటి. స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి మీ కారణం ఏమైనప్పటికీ ఐఫోన్‌లలో ఆ విధానం ఏమిటంటే పవర్ కీ, వాల్యూమ్ కీని ఒకేసారి ప్రెస్ చేయడం. ఇది సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ కొంతమందికి దీనిని ఉపయోగించడం కొంచెం కష్టం.

మీ చేతులతో జిమ్నాస్టిక్స్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి సరికొత్త మార్గం ఉంది. ఐఫోన్‌లో ఒక్క బటన్‌ని క్లిక్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.  అలా చేయడానికి ఒక చిట్కా ఉంది. మీరు చేయాల్సిందల్లా సెట్టింగ్‌లను మార్చి మీ ఐఫోన్ వెనుక వైపు నొక్కడానికి మీ వేళ్లను ఉపయోగించడం. అర్ధం కాలేదు కదా... !  

బటన్ నొక్కకుండా ఐఫోన్ స్క్రీన్ షాట్ తీయాలంటే... "బ్యాక్ ట్యాప్" ఫంక్షన్‌ను ఉపయోగిస్తాము. iOS లోని ఇతర షార్ట్‌కట్‌ల కోసం బ్యాక్ ట్యాప్ ఫీచర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిలో ఆపిల్ లోగోపై రెండుసార్లు లేదా మూడుసార్లు నొక్కితే ఈజీగా స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది.

ఐఫోన్ లోని సెట్టింగ్‌ల యాప్‌ ఓపెన్ చేయండి.
సెర్చ్ ఫర్ యాక్సెస్ ను ఓపెన్ చేయండి
టచ్ లోపల బ్యాక్ ట్యాప్ ఓపెన్ చేయండి
డబుల్ లేదా ట్రిపుల్ ట్యాప్ ఎంచుకోండి. ఆపై స్క్రీన్ షాట్ ఎంచుకోండి.
ఇప్పుడు ఐఫోన్ వెనుక భాగంలో డబుల్ లేదా ట్రిపుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ షాట్ ఈజీగా వచ్చేస్తుంది.
బ్యాక్ ట్యాప్ కూడా కేసులతో పని చేస్తుంది. కాబట్టి మీరు ఇబ్బందికరమైన బటన్ కాంబోని నొక్కకుండా ఏ పరిస్థితిలోనైనా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మీ ఐఫోన్ వెనుక భాగాన్ని ట్యాప్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: