
* ఛార్జింగ్ పెట్టే సమయంలో మీ ఫోన్ ను కొంచెం శాతం మిగిలి వుండగానే తీసేయడం మంచిది. మరియు మీ ఫోన్ ను పదే పదే ఛార్జింగ్ పెట్టకండి. ఇలా చేయడం వలన కూడా ఫోన్ హీట్ ఎక్కుతుంది.
* కొందరు మొబైల్ మోడల్ అందరికీ కనబడాలనో లేదా డిజైన్ అందరికీ తెలియాలనో ఫోన్ కు ఎటువంటి కవర్ వేయరు. ఇలా చేయడం వలన సూర్యకిరణాలు డైరెక్ట్ గా ఫోన్ మీద పడి హీట్ ఎక్కుతుంది. కాబట్టి ఫోన్ కు ప్రొటెక్షన్ గా మొబైల్ కవర్ వాడండి.
*మీరు తరచూ ఒకేసారి చాలా మొబైల్ యాప్ లను వాడుతూ ఉంటారు. కానీ కొన్ని యాప్ లు బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. వాటిని క్లోజ్ చేయండి.
* మీరు ఫోన్ వాడే సమయంలో బ్రైట్ నెస్ తక్కువగా పెట్టుకోవడం వలన కూడా ఫోన్ వేడెక్కడం తగ్గించుకోవచ్చు.
* ఇంకో ముఖ్యమైన విషయం ఛార్జింగ్ అయిపోయింది కదా అని, ఎవరి ఛార్జర్ పడితే వారిది వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా మీ ఫోన్ వెడుక్కుతుంది. కాబట్టి మీ ఫోన్ కు వచ్చిన ఒరిజినల్ ఛార్జర్ ను మాత్రమే వాడడం మంచిది.
మరి ఈ విషయాలు అన్నీ చదివి అర్థం చేసుకుని పాటించగలరు.